శ‌రీరంలో వేడి త‌గ్గాలా.. అయితే ఇవి తీసుకోవాల్సిందే?

ఒంట్లో వేడి ఎక్కువైపోయింది బాబోయ్‌ అని ఎవ‌రో ఒక‌రు త‌ర‌చూ అంటుంటే మ‌నం వింటూనే ఉంటాం.ఒంట్లో వేడి చేయ‌డం అనేది చాలా మందిలో క‌నిపించే కామ‌న్ స‌మ‌స్య‌.

 These Foods Help To Reduce Body Heat-TeluguStop.com

దీని వ‌ల్ల అనేక స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ముఖ్యంగా మలబద్ధకం, తల నొప్పి, మూత్రం లో మంట, ముక్కులో నుంచి ర‌క్తం రావ‌డం, వికారంగా ఉండ‌టం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

అందుకే ఒంట్లో వేడిని త‌గ్గించుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయేవి డైట్‌లో చేర్చుకుంటే సులువుగా శ‌రీరంలో వేడిని త‌గ్గించుకోవ‌చ్చు.

 These Foods Help To Reduce Body Heat-శ‌రీరంలో వేడి త‌గ్గాలా.. అయితే ఇవి తీసుకోవాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాడీ హీట్ తగ్గించడంలో పుచ్చకాయ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది. పుచ్చ‌కాయ‌లో అధికంగా ఎండే నీరు మిమ్మల్ని చల్లగా మరియు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.కేవ‌లం పుచ్చ‌కాయ మాత్ర‌మే కాదు నీటి శాతం అధికంగా ఉండే కర్భూజా, ద్రాక్ష, కీరదోసకాయ వంటివి తీసుకున్నా ఒంట్లో వేడి త‌గ్గుముఖం ప‌డుతుంది.

అలాగే శ‌రీరంలో అధిక వేడిని నివారించ‌డంలో మెంతులు కూడా గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.మొంతుల‌ను పొడి చేసి గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి సేవిస్తే బాడీలో ఉండే ఓవ‌ర్ హీట్ నార్మ‌ల్ అవుతుంది.గ్లాస్ మ‌జ్జిగ‌లో ఉప్పు మ‌రియు నిమ్మ ర‌సం యాడ్ చేసి త‌ర‌చూ తాగుతున్నా కూడా ఒంట్లో వేడి త‌గ్గుముఖం ప‌డుతుంది.

మ‌రియు వాట‌ర్‌, కొబ్బ‌రి నీరు వంటివి కూడా త‌ర‌చూ తీసుకుంటూ ఉండాలి.

Telugu Body Heat, Body Temperature, Food, Good Foods, Good Health, Health, Health Tips, Reduce Body Heat-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అదేవిధంగా, ఒంట్లో వేడి స‌మ‌స్య అధికంగా ఉన్న ‌వాళ్లు చల్లని పాలలో తేనె కలుపుకుని తాగినా మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.ఇక గసగసాలు కూడా బాడీ హిట్‌ను నివారించి శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డంలో సూప‌ర్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.కొన్ని గసగసాల‌ను నీరుతో పాటు తీసుకుంటే శ‌రీరం చ‌ల్ల బ‌డుతుంది.

అయితే గ‌స‌గ‌సాల‌ను అధికంగా మాత్రం తీసుకో రాదు.

#Reduce #Temperature #Foods #Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు