విట‌మిన్ ఎ లోపమా? అయితే మీ డైట్‌లో ఈ ఫుడ్స్ ఉండాల్సిందే!

విట‌మిన్ ఎ లోపం..

 These Foods Help To Get Rid Of Vitamin A Deficiency-TeluguStop.com

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మందిలో కామ‌న్‌గా క‌నిపించే స‌మ‌స్య‌ల్లో ఇదీ ఒక‌టి.శ‌రీరంలో విట‌మిన్ ఎ లోపించ‌డం వ‌ల్ల కంటి చూపు త‌గ్గ‌డం, పిల్ల‌ల్లో ఎదుగుద‌ల లేక పోవ‌డం, సంతాన లేమి, మొటిమ‌లు, చ‌ర్మం త‌ర‌చూ పొడి బార‌డం, గొంతు ఇన్ఫెక్ష‌న్, మెద‌డు ప‌ని తీరు మంద‌గించ‌డం ఇలా అనేక స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటాయి.

ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డాలీ అంటే.ఖ‌చ్చితంగా విట‌మిన్ ఎ లోపాన్ని నివారించుకోవాల్సిందే.

 These Foods Help To Get Rid Of Vitamin A Deficiency-విట‌మిన్ ఎ లోపమా అయితే మీ డైట్‌లో ఈ ఫుడ్స్ ఉండాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే విట‌మిన్ ఎ కి చెక్ పెట్ట‌డంలో కొన్ని కొన్ని ఫుడ్స్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ ఫుడ్స్ ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూర‌ల్లో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది.ముఖ్యంగా పాల‌కూర‌, బ్రొకోలీ, మెంతి కూర, బచ్చలి కూర వంటి ఆకుకూల‌ర‌ను వారంలో రెండు, మూడు సార్లు తీసుకుంటే గ‌నుక‌.

విట‌మిన్ ఎ లోపం దూరం అవుతుంది.

అలాగే క్యారెట్‌ను డైరెక్ట్‌గా తీసుకోవ‌డం లేదా జ్యూస్ త‌యారు చేసుకుని తీసుకోవ‌డం చేయాలి.

ఇలా ఎలా చేసినా శ‌రీరానికి విట‌మిన్ ఎ స‌మృద్ధిగా ఉంటుంది.

విట‌మిన్ ఎ లోపాన్ని నివారించ‌డంలో గుడ్డు కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌తి రోజు ఉడికించిన గుడ్డును తీసుకుంటే.క్ర‌మంగా విట‌మిన్ ఎ లోపం త‌గ్గు ముఖం ప‌డుతుంది.

చేప‌లు విటమిన్ ఎ ఉత్తమ వనరులలో ఒకటి అన‌డంలో సందేహ‌మే లేదు.అందు వ‌ల్ల‌, వారంలో రెండు సార్లు చేప‌లు తీసుకుంటే.విట‌మిన్ ఎ లోపం ప‌రార్ అవుతుంది.

ఇవే కాదు.

చిలగడదుంపలు, పాలు, వెన్న‌, నెయి, ప‌నీర్‌, పెరుగు, గుమ్మ‌డి కాయ‌, వాల్ న‌ట్స్‌, పిస్తా ప‌ప్పు, బొప్పాయి పండు, మామిడి పండు, క్యాప్సిక‌మ్, అవ‌కాడో, యాపిల్‌, అప్రికాట్స్ వంటి ఆహారాల్లోనూ విట‌మిన్ ఎ ఉంటుంది.కాబ‌ట్టి, ఈ ఆహారాల‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే.

విట‌మిన్ ఎ లోపానికి బై బై చెప్పొచ్చు.

#Vitamin #Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు