హైబీపీనే కాదు లోబీపీ సమస్య కూడా ఎందరినో వేధిస్తోంది.రక్త పోటు స్థాయిలు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటమే లోబీపీ.
తరచూ కళ్లు తిరగడం, నీరసం, అలసట, తలనొప్పి, తల భారంగా ఉండటం, వాంతులు, వికారం, మత్తుగా ఉండటం, ఏ పనిపైనే శ్రద్ధ లేకపోవడం, అధిక దాహం.ఇవన్నీ కూడా లోబీపీ లక్షణాలు.
వీటిని నిర్లక్ష్యం చేస్తూ కాలాన్ని గడిపామంటే ప్రాణాలే రిస్క్‌లో పడతాయి.అందుకే లోబీపీని నివారించుకునేందుకు చాలా మంది మందులు వాడుతుంటారు.
అయితే కొన్ని కొన్ని ఆహారాలు కూడా లోబీపీ సమస్యను తగ్గిస్తాయి.మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.రక్తపోటును సాధారణ స్థితిలోకి తెప్పించడంలో ఎండు ద్రాక్ష అద్భుతంగా సహాయడుతుంది.అందు వల్ల, లోబీపీ బాధితులు రెగ్యులర్‌గా పది ఎండుద్రాక్షలను తీసుకుంటే ఎంతో మంచిది.
పైగా ఎండుద్రాక్షలను తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.గుండె ఆరోగ్యం పెరుగుతుంది.
అల్లం కూడా లోబీపీ సమస్యకు చెక్ పెట్టగలదు.ఒక గ్లాస్ వాటర్ లో దంచిన అల్లం ముక్క వేసి బాగా మరిగించివడబోసుకోవాలి.ఇప్పుడు ఇందులో తేనె కలిపి సేవించాలి.రోజుకు ఒక కప్పు చప్పు న ఈ అల్లం నీటిని తీసుకుంటే రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి.

బీపీ పడి పోయి నీరసానికి వచ్చేశారు అంటే అప్పుడు వెంటనే అర గ్లాస్ వాటర్‌లో అర స్పూన్ ఉప్పు మరియు ఒక స్పూన్ నిమ్మ రసం కలిపి సేవించాలి.ఇలా చేస్తే కొన్ని నిమిషాలకే లో బీపీ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.
లోబీపీని నివారించడంలో గ్రీన్ టీ కూడా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.బీపీ తక్కువగా ఉన్నప్పుడు ఒక కప్పు గ్రీన్ టీ తీసుకుంటే.సహజంగానే రక్త పోటు స్థాయిలు పోరుగుతాయి.మరియు లో బీపీ లక్షణాలన్నీ పరార్ అవుతాయి.
ఒక వేళ గ్రీన్ టీ అందుబాటులో లేకుంటే.బ్లాక్ కాఫీ కూడా తీసుకోవచ్చు.