ఈ పానీయాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ ఈజీగా క‌రిగిపోతుంద‌ట‌!

మ‌న‌షుల్లో మంచి వాళ్లు, చెడ్డ వాళ్లు ఉన్న‌ట్టు.కొలెస్ట్రాల్‌లోనూ గుడ్ కొలెస్ట్రాల్‌, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని రెండు ర‌కాలు ఉన్నాయి.

 These Drinks Help To Decrease Bad Cholesterol Levels! Best Drinks, Bad Cholester-TeluguStop.com

గుడ్ కొలెస్ట్రాల్ మ‌న ఆరోగ్యాన్ని కాపాడితే.బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆరోగ్యాన్ని నాశ‌నం చేస్తుంది.

అందుకే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను నివారించుకుని.మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవాల‌ని ఆరోగ్య నిపుణ‌లు సూచిస్తుంటారు.

అయితే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించ‌డంలో కొన్ని కొన్ని పానీయాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అవేంటి.? ఎప్పుడో తాగాలి.? అన్న విష‌యాలు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్ మిల్క్ రుచిగా ఉండ‌ట‌మే కాదు ర‌క్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను సైతం క‌రిగించ‌గ‌ల‌దు.వారంలో ఐదు సార్లు ఓట్ మిల్క్ ను తీసుకుంటే గ‌నుక‌.బ్యాడ్‌ కొలెస్ట్రాల్ లెవెల్స్ క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మ‌రియు ఓట్ మిల్క్ త‌గ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మార‌తాయి.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను అదుపు లో ఉంటాయి.బ‌రువూ త‌గ్గుతారు.

రెడ్ వైన్ సైతం కొలెస్ట్రాల్‌ను క‌రిగించ‌గ‌ల‌దు.ప్ర‌తి రోజూ త‌గిన మోతాదులో రెడ్ వైన్‌ను తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ స‌మ‌స్యే ఉండ‌దు.మరియు రెడ్ వైన్ ను సేవించ‌డం వ‌ల్ల చ‌ర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.ఇమ్యూనిటీ సిస్ట‌మ్ స్ట్రోంగ్‌గా మారుతుంది.

కొన్ని రకాల క్యాన్సర్ నుండి సైతం రక్షణ ల‌భిస్తుంది.

Telugu Bad Cholesterol, Drinks, Tips, Latest, Oat Milk, Red Wine, Tomato-Telugu

ఇక టమోటా జ్యూస్ కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.వారంలో నాలుగు లేదా ఐదు సార్లు ఫ్రెస్ ట‌మాటాల‌తో జ్యూస్ త‌యారు చేసుకుని తీసుకుంటే ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రుగుతుంది.మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

త‌ద్వారా గుండె సంబంధింత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.పైగా ట‌మాటా జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

వెయిట్ లాస్ అవుతారు.మ‌రియు చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా మెరిసి పోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube