జుట్టు రాలే స‌మ‌స్య‌కు ఈ వ్యాధులూ కార‌ణమే... అవేమిటో తెలిస్తే..

అస్త‌వ్య‌స్త‌మైన‌ జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.వీటిలో ఒక‌టే జుట్టుకు సంబంధించిన స‌మ‌స్య‌లు.

 These Diseases Are Also The Cause Of Hair Loss Problem Health Doctors Peple, Dis-TeluguStop.com

జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది.నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక రోజులో 70 నుండి 80 వెంట్రుకలు వస్తాయి.

అయితే దీనికి మించి అధికంగా జుట్టు రాలిపోతే అది తీవ్రమైన అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టైఫాయిడ్:

శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్ మనల్ని ప‌ట్టి పీడిస్తుంది.ఈ స‌మ‌యంలో విపరీతమైన జ్వరం, ఒంటి నొప్పులు అధికంగా ఉంటాయి.

టైఫాయిడ్‌ను నయం కావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది.ఈ పరిస్థితిలో జుట్టు రాలడం కూడా మొదలవుతుందని నిపుణులు చెబుతుంటారు.

ఒత్తిడి

: ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న పోటీ కారణంగా చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.ఇది డిప్రెషన్‌కు దారితీస్తుంది.

డిప్రెషన్ కార‌ణంగా జుట్టు వేగంగా రాలిపోతుందని నిపుణులు చెబుతారు.

ఫంగల్ ఇన్ఫెక్షన్

: అనారోగ్య‌క‌ర‌మైన‌ జీవనశైలి జుట్టుపై ప్రభావాన్ని చూపుతుంది.ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా క్రమంగా జుట్టు రాలడం కూడా ప్రారంభమవుతుంది.స్కాల్ప్‌లో ఉండే చుండ్రు.

జుట్టును దెబ్బతీస్తుంది.చుండ్రు స‌మ‌స్య ఉన్న‌ప్పుడు వైద్యుడిని సంప్రదించడం ఉత్త‌మం.

రక్తపోటు:

ర‌క్త‌పోటు కార‌ణంగా ఒక్కోసారి జుట్టు రాలడం మొదలవుతుంది. రక్తపోటు సమస్య నివార‌ణ‌కు వైద్యుడిని సంప్రదించాలి.పోష‌కాహారంపై శ్ర‌ద్ధ చూపాలి.

These Diseases Are Also The Cause Of Hair Loss Problem Health Doctors Peple, Diseases , Loss Problem , Health , Fungal Infection, Stress, Blood Pressure - Telugu Pressure, Diseases, Fungal, Problem, Problems, Stress

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube