టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, నందమూరి కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.మెగా, నందమూరి కాంపౌండ్స్ లో పని చేయాలని చాలామంది దర్శకులు భావిస్తారు.
అయితే నందమూరి హీరోలకు హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు మెగా హీరోలకు మాత్రం షాకిచ్చారనే చెప్పాలి.ఈ జాబితాలో ప్రధానంగా బోయపాటి శ్రీను, కొరటాల శివ పేర్లను చెప్పాలి.
ఈ ఇద్దరు డైరెక్టర్లు అటు మెగా ఇటు నందమూరి హీరోలతో సినిమాలు చేశారు.
బాలయ్య బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కాంబినేషన్ లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు తెరకెక్కగా ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.
ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన దమ్ము సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోయినా కలెక్షన్ల పరంగా ఈ సినిమా హిట్ అనే చెప్పుకోవాలి.ఈ సినిమా అప్పట్లో 35 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
నందమూరి హీరోలకు మూడు హిట్లు ఒక యావరేజ్ ఇచ్చిన బోయపాటి శ్రీను రామ్ చరణ్ తో( Ram Charan ) వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.కొరటాల శివ( Koratala Siva ) జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్( Janatha Garage Movie ) సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం గమనార్హం.
అయితే కొరటాల శివ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.నందమూరి ఫ్యామిలీకి అచ్చొచ్చిన డైరెక్టర్లు మెగా ఫ్యామిలీకి మాత్రం షాకిస్తుండటం గమనార్హం.మెగా హీరోలకు కొంతమంది డైరెక్టర్లు ఫ్లాపులివ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.