మార్చి నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న సెలబ్రిటీలు వీళ్లే..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సినీ ప్రముఖులు మార్చి నెలలో జన్మించి ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడంతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఆనంద్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్న కమలినీ ముఖర్జీ పుట్టినరోజు మార్చి 4.

 These  Bollywood Celebrities Birthdays In March , Aarthi Agarwal, Birthdays In M-TeluguStop.com

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న దివంగత నటి ఆర్తి అగర్వాల్ పుట్టినరోజు మార్చి5.

పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతూవర్మ పుట్టినరోజు మార్చి 10.ఆమె నటించిన వరుడు కావలెను సినిమా త్వరలో విడుదల కానుంది.కాళిదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సుశాంత్ పుట్టినరోజు మార్చి 18.

గతేడాది అల వైకుంఠపురములో మూవీలో ప్రాధాన్యత లేని పాత్రలో సుశాంత్ నటించగా ఆ సినిమా సుశాంత్ కెరీర్ కు ప్లస్ కాలేదు.

వందల సంఖ్యలో సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు పుట్టినరోజు మార్చి 19.ఫ్యామిలీ సినిమాలలో ఎక్కువగా నటించి గత కొన్నేళ్ల నుంచి పరిమిత సంఖ్యలో సినిమాలలో నటిస్తున్న శ్రీకాంత్ పుట్టినరోజు మార్చి 23.విలక్షణ నటుడిగా తెలుగుతో పాటు ఇతర భాషల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు మార్చి 26.

Telugu Aarti Agarwal, Birthdays March, Nithin, Prakash Raj, Ram Charan, Sushanth

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ మార్చి 27వ తేదీన జన్మించారు.27వ తేదీన ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల నుంచి చరణ్ పాత్రలకు సంబంధించి అప్ డేట్స్ రావచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.టాలీవుడ్ యువహీరో నితిన్ పుట్టినరోజు మార్చి 30.వరుసగా సినిమాల్లో నితిన్ నటిస్తుండగా నాలుగు రోజుల క్రితం నితిన్ నటించిన చెక్ మూవీ విడుదలై బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలిచింది.ఈ నెలలో విడుదల కాబోతున్న రంగ్ దే సినిమాపైనే నితిన్ ఆశలు పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube