ఎన్టీఆర్‌ కోపం ఆ ఇద్దరి పైనేనా?     2017-09-26   00:08:25  IST  Raghu V

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కి కోపం వచ్చింది‌. సినిమా రివ్యూలు రాసే సినిమా జర్నలిస్టుల మీద టైగర్ లా విరుచుకుపడ్డాడు ఎన్టీఆర్. ఎన్నడు లేనిది, ఫిలిం క్రిటిక్స్ మీద తన కోపమంతా వెల్లగక్కాడు. ఇంత కోపం ఎందుకు వచ్చింది? సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయి. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల షేర్ వసూలు చేసింది జైలవకుశ. మరింకేం?

సినిమా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పేషెంట్ అయితే, ప్రేక్షకులు డాక్టర్లు. పేషెంట్లో ప్రాణం ఉందో, లేదో తేల్చాల్సింది ప్రేక్షకులు. మధ్యలో ఈ క్రిటిక్స్ ఎవరు? దారిన పోయే దాన్నయ్యలు. అంతా వీరికే తెలిసినట్టు సినిమా ఫలితాన్ని తేల్చేస్తారు అంటూ సినిమా రివ్యూ రైటర్స్ ని ఎద్దేవా చేసాడు ఎన్టీఆర్. ఇంతకి ఎన్టీఆర్‌ టార్గెట్ చేసింది ఎవరిని?జైలవకుశ కి తక్కువ రేటింగ్ ఇచ్చిన ఓ ప్రముఖ వెబ్ సైట్ తో పాటు TV9 కి సినిమా వార్తల కరెస్పాండెంట్ గా వ్యవహరించే ఓ బడా సినిమా క్రిటిక్ మీద ఎన్టీఆర్ కి కోపం వచ్చినట్లు టాక్. ఓవర్సీస్ జనాలు ఎక్కువగా ఆ వెబ్ సైట్ ని చదువుతారు‌. జైలవకుశ ఓవర్సీస్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. వీకెండ్ తరువాత తగ్గుముఖం పట్టింది ట్రెండ్. ఆ వెబ్ సైట్ రేటింగ్ ప్రభావం ఎంతోకొంత ఉంటుంది అని యంగ్ టైగర్ భావిస్తున్నాడేమో. అందుకేనేమో, ఎప్పుడు లేనిది ఇంత ఆవేశం పొంగుకొచ్చింది.

ఈ సినిమాకి మరీ బ్యాడ్ రివ్యూలేమి రాలేదు. పైన చెప్పినట్టుగా కొంతమంది మాత్రమే తక్కువ లేదా నెగటివ్ రివ్యూలు ఇచ్చారు. ఎన్టీఆర్ కోపం ఆ కొంతమంది మీదే అనుకుంటా మరి.