ఇప్పటివరకు ఎక్కువ మందిని బలిగొన్న అతి భయంకరమైన భూకంపాలు ఇవే...!

తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌లో వచ్చిన తీవ్ర భూకంపం వల్ల వెయ్యి మందికి పైగా ప్రజలు చనిపోయారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

 These Are The Worst Earthquakes To Hit The Country So Far Details, Earth Quake,-TeluguStop.com

ఇక గాయాలపాలైన వారి సంఖ్య రెండు వేల వరకు చేరుకుంది.ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందిని బలిగొన్న భూకంపాలు ఏవి? అవి ఎక్కడ సంభవించాయి? వంటి నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హయతి, 2010

హయతి దేశంలో ఎప్పుడూ భూకంపాలు వస్తూనే ఉంటాయి.ఈ మధ్య ఈ దేశంలో భూకంపం వచ్చి చాలా మంది చనిపోయిన విషయం తెలిసిందే.

అయితే 2010 జనవరిలో ఈ దేశంలో అతి పెద్ద భూకంపం సంభవించింది.ఈ భారీ భూకంపం 3.16 లక్షల మంది ప్రాణాలను హరించేసింది.ఈ సమయంలో ఏకంగా యాభై రెండు సార్లు భూమి కంపించింది.దాంతో 2.5 లక్షల ఇళ్లు, 30 వేల బిజినెస్ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి.ఈ దుర్ఘటనలో మూడు లక్షలకు పైగా జనాలు చచ్చిపోతే 30 లక్షల మందికి పైగా నిస్సహాయస్థితిలో రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చిలీ, 1960

Telugu China, Earth Quake, Hayathiearth, Latest-Latest News - Telugu

1960 సంవత్సరం చిలీ దేశంలో రిక్టర్ స్కేల్‌పై 9.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ ప్రకృతి విపత్తులో 1,665 మంది చనిపోగా… మూడు వేలకు పైగా మృత్యువాత పడ్డారు.ఒకేరోజు, క్షణాల్లోనే, ఒకే దేశంలో ఈ సంఖ్యలో మరణించడం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది.

చైనా, 1973

Telugu China, Earth Quake, Hayathiearth, Latest-Latest News - Telugu

చైనాలో 1973లో తంక్షన్ సిటీలో వచ్చిన భూకంపం ఏకంగా 2,42,769 మంది జనాలను పొట్టన పెట్టుకుంది.లక్షన్నరకు పైగా ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ భూకంపం వచ్చింది కేవలం ఒక్క నిమిషం మాత్రమే కానీ ఆ సమయంలోనే సిటీలోని 85 శాతం ఇళ్లు భూస్థాపితం అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube