ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించే మార్గాలు ఇవే...!

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు.ప్రస్తుత తరుణంలో ఉన్న ఉద్యోగాలు పోయే దశలో ఉన్నాయి.

 How To Earn Money From Home, Freelance, Instagram, Finance, Lock Down, Work From-TeluguStop.com

ఆ తర్వాత మళ్లీ కొత్తగా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఎవరికి లేదు.కరోనా కారణంగా దేశం ఆర్థికంగా కుదేలైంది.

కొత్త కంపెనీల్లో ఉద్యోగాలు లేక ఉన్న కంపెనీల్లోనూ ప్రస్తుతం ఉద్యోగాలు తొలగిస్తున్న పరిస్థితి.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అయితే ఈ ఆన్ లైన్ యుగంలో డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు.ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకోవచ్చు.

కష్టపడే తత్వం, నైపుణ్యం ఉండాలే గానీ వర్క్ ఫ్రమ్ హోం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు.

మరి ఎలాంటి వాటి ద్వారా డబ్బు సంపాదించవచ్చు ఒకసారి చూద్దామా… ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా యాప్స్ లో ఇంస్టాగ్రామ్ కూడా పాపులర్ అవుతోంది.

ఇప్పటికే ఇందులో కొన్ని మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు.రోజు లక్షల్లో పోస్టులు పెడుతుంటారు.అయితే ఇంస్టాగ్రామ్ మార్కెటింగ్ చేస్తూ ఆయా కంపెనీల ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయాలి.ఇందులో పనికి తగ్గట్లు కమీషన్ పొందవచ్చు.

దీంతో పాటుగా సోషల్ మీడియా మార్కెటింగ్ కన్సల్టెంట్ మార్కెంటింగ్ చేసుకోవచ్చు.ఇక మరో ఆదాయ మార్గం చూస్తే…హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషల్లో పట్టు ఉండి కొన్ని వెబ్ సైట్లకు ఆర్టికల్స్ రాసి పంపిస్తే చాలు ఇంట్లోనే ఉండి డబ్బు సులభంగా సంపాదించుకోవచ్చు.

Telugu Articles, Freelance, Lock-

ఇక మరి కొందరు మాత్రం చేయగలిగే వాటిలో… మార్కెటింగ్ కంపెనీల్లో స్కిల్స్ ఉన్న ఐటీ స్పెషలిస్టులు అవసరం ఎప్పటికీ ఉంటుంది.కాబట్టి అలాంటి వారికి స్టాండెర్డ్ ఐటీ కంపెనీల్లో ఎప్పటికప్పుడు పని దొరకవచ్చు.ఇక అలాగే ఫోటోషాప్ లాంటి కొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ సాప్ట్ వేర్లపై పట్టు ఉంటే ఇంట్లో గ్రాఫిక్ డిజైన్లు చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు.కాబట్టి మీరు కూడా ఇందులో ఏదైనా స్కిల్స్ ఉంటే వెంటనే ఇంట్లోనే కూర్చొని మీ తెలివిని ఉపయోగించి సులభంగా డబ్బులు సంపాదించుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube