జూలై 2021 సంవత్సరంలో వచ్చే పండుగలు ఇవే!

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జులై నెల 7వ నెల.ఏడవ నెల అయిన జులై మాసం ఎన్నో పండుగలకు వ్రతాలకు నిలయం అని చెప్పవచ్చు.

 These Are The Upcoming Festivals In The Year July 2021, July 2021, Festivals, La-TeluguStop.com

దేశవ్యాప్తంగా ఈ నెలలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాల పండుగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.మరి జూలై మాసంలో ఏ తేదీ ఏ పండుగ జరుపుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం.

జూలై నెల 5వ తేదీ అనగా సోమవారం జ్యేష్ఠ మాసం క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు.యోగిని ఏకాదశిని ఎంతో పరమ పవిత్రంగా భావించి కొందరు వ్రతం ఆచరిస్తారు.

ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు వ్రతమాచరించి ఉపవాసం చేయటం వల్ల 88 వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యాన్ని పొందుతారు అని చెబుతారు.అదేవిధంగా జూలై 7వ తేదీ ప్రదోశ్ వ్రతం చేసుకుంటారు.

ఈరోజు పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.జూలై 11న తెలంగాణ బోనాల పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

అదేవిధంగా జూలై 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆషాడ నవరాత్రులు ప్రారంభమవుతాయి.ఈ నవరాత్రులలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Telugu Festivals, July, Lard Shiva, Pooja-Telugu Bhakthi

జులై 12వ తేదీ పూరి జగన్నాథుని రథయాత్ర.12వ తేదీ ప్రారంభమయ్యే సుమారు పదిరోజుల పాటు ఎంతో ఘనంగా జరుగుతాయి.జులై 13వ తేదీ వినాయక చవితి.జూలై 20వ తేదీన వచ్చే ఏకాదశిని దేవశయని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజే మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడని పురాణాలు చెబుతాయి.

జూలై 21 ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే బక్రీద్ పండుగ.జులై 24 గురుపౌర్ణమి.జులై 27 వ తేదీ సంకష్టహర చతుర్దశి.ఈ విధంగా జూలై మాసంలో వివిధ పండుగలు ఎంతో ఘనంగా వేడుకగా జరుపుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube