బాహుబలి గురించి ఎవరికి తెలియని చీకటి రహస్యాలు ఇవే!

“బాహుబలి” ఈ పేరు ప్రపంచ స్థాయిలో ఏ విధంగా మారుమోగిందో అందరికీ తెలిసిందే.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసింది.

 These Are The Unknow Fats About Bahubali That No One Knows-TeluguStop.com

అద్భుతమైన గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని రికార్డులను సృష్టించింది.రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకులకు కూడా ఈ స్థాయిలో అంచనాలను పెట్టుకొని ఉంటారు.

అయితే బాహుబలి సినిమా ప్రేక్షకుల అంచనాలను దాటిపోయిందని చెప్పవచ్చు.ఈ విధంగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సృష్టించిన బాహుబలి చిత్రంలో మనకు తెలియని ఎన్నో లాజిక్కులను దర్శక ధీరుడు చూపించారు.

 These Are The Unknow Fats About Bahubali That No One Knows-బాహుబలి గురించి ఎవరికి తెలియని చీకటి రహస్యాలు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా బాహుబలి 2 చిత్రంలో కట్టప్ప, అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) ఇద్దరు రాజమాత శివగామి ఆజ్ఞమేరకు దేశాటన బయలుదేరి వెళ్లిన వీరు కుంతల దేశానికి వెళ్తారు.అక్కడ అనుష్క సామ్రాజ్యంపై కొందరు పిండారీల సైన్యం దూసుకువచ్చి కుంతల దేశంపై దాడి చేస్తుంది.

ఈ క్రమంలోనే ప్రభాస్ అక్కడికి దూసుకొచ్చిన సైన్యాన్ని పక్కనే ఉన్నటువంటి ఒక డ్యామ్ బద్దలు కొట్టి, ఆ నీటి ప్రవాహంలో ఈ పిండారీల సైన్యాన్ని కొట్టుకుపోయే విధంగా చేసే కుంతల దేశాన్ని రక్షిస్తాడు.ఈ సన్నివేశం కాస్త ప్రేక్షకులలలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

అయితే కుంతల దేశంపై దాడి చేసిన పిండారీలను మట్టుపెట్టడానికి డ్యామ్ బద్దలు కొట్టాల్సిన పనిలేదు.ఇతర ఆలోచనలను చేసి వారిని చంపవచ్చు కానీ డ్యామ్ బద్దలు కొట్టే చంపడానికి కారణం ఏమిటంటే.

Telugu Bahubali, Bahubali 2, Bahubali Facts, Director Rajamouli, Kattappa, Kunthala Rajyam, Pan India Movie, Pindari, Prabhas, Tollywood, Unknow Facts-Movie

కుంతల దేశానికి మొట్టమొదటి సారిగా వచ్చిన అమరేంద్రబాహుబలి ఒక సరస్సులో నీటిని తాగడానికి ప్రయత్నించినప్పుడు అందులో మనుషుల శవాలు కనిపిస్తాయి.“ఇది పిండారీలు చేసిన మారణకాండ.ధాన్యం, డబ్బులు దోచుకుని… జనాలందరినీ జల సమాధి చేయడం పిండారీలకు అలవాటు” అంటూ కట్టప్ప తనకు వివరిస్తాడు.ఆ విధంగా జనాల కష్టాన్ని దోచుకొని వారిని ఇలా చంపిన పిండారీలకు అదే స్టైల్ లోనే వారిని చంపాలని భావించి, పిండారీలు కుంతల దేశంపై దాడి చేసే సమయంలో అమరేంద్ర బాహుబలి డ్యామ్ బద్దలుకొట్టి, ఆ నీటి ప్రవాహంలో వారందరినీ మట్టు కరిపిస్తాడు.

ఈ విధంగా పిండారీలను చంపడానికి ఈ విధమైనటువంటి లాజిక్ ను ఉపయోగించారు మన దర్శకధీరుడు.

#Pindari #Pan India #Kattappa #Bahubali #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు