సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) తను చేసిన రాజకుమారుడు సినిమాతోనే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.
ఇక ఇలాంటి మహేష్ బాబు తన కెరీర్ లో ఎంతో మంది దర్శకులతో సినిమాను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.
అలాగే వెంకటేష్ లాంటి స్టార్ హీరో తో మల్టీ స్టారర్ సినిమా కూడా చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు చేసిన రెండు సినిమాల్లో రజనీకాంత్( Rajinikanth ) నటించాల్సింది.ఇక ఆయన రెండు సినిమాల్లో నటించకుండా వేరే వాళ్ళతో చేయించాల్సి వచ్చింది.
అయితే ఆ సినిమాలు ఏంటి అంటే మొదటగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’( Seethamma Vakitlo Sirimalle Chettu ) సినిమాలో ప్రకాష్ రాజ్( Prakash Raj ) పోషించిన పాత్ర మొదటగా రజనీకాంత్ చేత చేయించాలి అనుకున్నాడంట.కానీ అప్పుడు రజనీకాంత్ కి( Rajinikanth ) కొంచెం అనారోగ్యం గా ఉండడంతో ఆయన ఆ పాత్ర చేయలేకపోయారు… ఇక దీంతో పాటుగా శ్రీమంతుడు( Srimanthudu ) సినిమాలో జగపతిబాబు పోషించిన పాత్రకి మొదటగా రజనీకాంత్ ని తీసుకోవాలి అనుకున్నాడట కానీ అది కూడా మిస్ అయింది.
ఆ పాత్ర ను రజనీకాంత్ చేసి ఉంటే ఆ పాత్ర పరిమితి అనేది ఇంకొంచెం పెంచుండేవారు.జగపతిబాబు చేశారు కాబట్టి ఆ పాత్ర లెంత్ అనేది తగ్గించి మహేష్ బాబు లెంత్ పెంచారు.ఒకవేళ రజనీకాంత్ కనక చేసి ఉంటే ఆ పాత్ర హైలెట్ గా ఉండేది.అలాగే సినిమా కూడా తెలుగు, తమిళం రెండు భాషల్లో మరింత భారీ వసూళ్లను రాబట్టి ఉండేది…
.