రిలీజ్ రోజే కోట్లు తెచ్చిన టాప్ టెన్ తెలుగు సినిమాలు ఇవే!

మామూలుగా సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఆ సినిమా నుంచి విడుదలైన టీజర్ లు పోస్టర్లను బట్టి ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో అని అంచనాలు వేస్తూ ఉంటారు.అదేవిధంగా సినిమా విడుదలైన తొలి రోజే రాబట్టి వసూళ్లను బట్టి హీరో క్రేజ్ ఏంటో ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో అన్నది లెక్కగడుతుంటారు అభిమానులు.

 These Are The Top Ten Telugu Films That Looted Quotes On The Day Of Release , Radhe Shyam , Bahubali 2 , Saho Movie , Agnatha Vaasi , Sarileru Nikevvaru Movie , Radhe Shyam Movie , Saira Narasimhareddy , Rrr , Sarkaru Vaari Paata, Pushpa , Bahubali 1 , 10 Telugu Movies , Tollywood Movie Industry-TeluguStop.com

అలాంటిది స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఏ రేంజ్ లో హంగామా ఉంటుందో మనందరికీ తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో విడుదలయ్యే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

సినిమాలు కూడా విడుదలైన మొదటి రోజే కోట్లలో కలెక్షన్స్ ను రాబడుతున్నాయి.మరి టాలీవుడ్ ఇండస్ట్రీ లో విడుదలైన తొలి రోజే కోట్లలో కలెక్షన్స్ ను రాబట్టిన టాప్ 10 తెలుగు సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

 These Are The Top Ten Telugu Films That Looted Quotes On The Day Of Release , Radhe Shyam , Bahubali 2 , Saho Movie , Agnatha Vaasi , Sarileru Nikevvaru Movie , Radhe Shyam Movie , Saira Narasimhareddy , Rrr , Sarkaru Vaari Paata, Pushpa , Bahubali 1 , 10 Telugu Movies , Tollywood Movie Industry-రిలీజ్ రోజే కోట్లు తెచ్చిన టాప్ టెన్ తెలుగు సినిమాలు ఇవే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజే 135 కోట్ల కలెక్షన్లను రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది.ఆ తరువాత బాహుబలి 2 సినిమా నిలిచింది.

ఈ సినిమా విడుదల అయి మొదటిరోజే 123 కోట్ల షేర్ ని రాబట్టింది.ఆ తర్వాత మూడవ చిత్రంగా సాహో సినిమా నిలిచింది.సాహో సినిమా విడుదల అయినా మొదటి రోజే 73.64 కోట్ల షేర్స్ ను రాబట్టింది.

ఆ తర్వాత నాలుగో సినిమా గా నిలిచిన సినిమా సైరా నరసింహారెడ్డి.మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజే 53.72 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది.ఆ తరువాత బాహుబలి 1 సినిమా నిలవగా, ఈ చిత్రం విడుదలైన తొలి రోజే 46, కోట్ల షేర్ ను రాబట్టింది.

ఒకవైపు అయితే సర్కారు వారి పాట సినిమా మరొక ఎత్తు అని చెప్పవచ్చు.మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా తాజాగా విడుదలై తొలి రోజే 36.01 కోట్లను రాబట్టి ఐదవ స్థానంలో నిలిచింది.ఆ తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలైన తొలి రోజే 43.16 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.ఆ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన రాధే శ్యామ్ సినిమా విడుదలైన మొదటి రోజే 40 కోట్ల షేర్ ను రాబట్టింది.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా విడుదలైన మొదటి రోజే 39.30 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.ఆ తర్వాత టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదల అయిన మొదటి రోజే 38.49 కోట్ల షేర్ రాబట్టింది.ఈ విధంగా టాలీవుడ్ లో ఈ సినిమాను విడుదల అయ్యి వరల్డ్ వైడ్ గా మొదటి రోజే ఈ విధంగా కలెక్షన్లను రాబట్టాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube