మామూలుగా ఏడాదిలో ఎన్నో రకాల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.అయితే అందులో కొన్ని రకాల సినిమాలు చూసినప్పుడు గతంలో అలాంటి సినిమాలు చూసిన అనుభూతి కలుగుతూ ఉంటుంది.
సినిమాలోని పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేదంటే స్టెప్పులు ఇలా ఏదో ఒకటి కాఫీ అవ్వడం లాంటిది జరుగుతుంది.మీకు తెలుసా ఒకే తరహా ఉన్న రెండు సినిమాలలో కొందరు టాలీవుడ్ స్టార్స్( Tollywood stars ) నటించారు.
ఇంతకీ ఆ స్టార్స్ ఎవరు వారు ఎటువంటి సినిమాలలో నటించారు అన్న వివరాల్లోకి వెళితే.
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు( Dukudu ) అలాగే ఆగడు సినిమాలు( Agadu ) ఒకే తరహా లోనే ఉంటాయి.అయితే ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది ఒకరే అన్న విషయం చాలామందికి తెలియదు.ఇంచుమించు ఈ రెండు సినిమాలు ఒకే విధంగా ఉంటాయి.
అలాగే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 , ఆర్య( Arya 2, Arya ) సినిమాలు కూడా ఒకే తరహాలో ఉంటాయి.ఈ రెండు సినిమాల స్టోరీ వేరు అయినప్పటికీ కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే.
అదేవిధంగా ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది కూడా ఒకరే.
అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు ( Balu )అలాగే పంజా( Panja ) సినిమాలు ఒకే తరహాలోనే ఉంటాయి.మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన దరువు, విక్ర మార్కుడు( Daruvu, Vikra Markudu ) సినిమాలలో కథలు వేరే అయినప్పటికీ ఈ సినిమాలు ఒకే విధంగా అనిపిస్తూ ఉంటుంది.