ఒక సినిమా హిట్ అయింది అంటే చాలు ఆ సినిమా ని పోలిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో వస్తూ ఉంటాయి…ప్రస్తుతం బేబీ సినిమా కూడా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది…ఈ మూవీ టీనేజ్ లో ఏర్పడిన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కింది.ఈ చిత్రం విజయం సాధించిన క్రమంలో గతంలో వచ్చిన టీనేజ్ ప్రేమకథ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బేబీ
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య( Anand Devarakonda, Vaishnavi Chaitanya ) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు.ఈ మూవీలో మరో హీరోగా విరాజ్ అశ్విన్ నటించారు…ప్రస్తుతం ఈ సినిమా సూపర్ సక్సెస్ దిశ గా దూసుకుపోతుంది.

బుట్టబొమ్మ
మలయాళ మూవీ “కప్పెల”కు రీమేక్ గా తెలుగులో రూపొందిన సినిమా “బుట్టబొమ్మ”( Buttabomma ).ఈ మూవీలో అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలలో నటించారు…ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

ఉప్పెన
2021 లో విడుదలైన ఉప్పెన( Uppena ) మూవీ ద్వారా పంజా వైష్ణవ్ తేజ్, కృతుశెట్టిలు హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు.ఈ మూవీకి సానా బుచ్చిబాబు దర్శకత్వం చేయగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు…ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసి వైష్ణవ్ తేజ్ కి ఒక గొప్ప డెబ్యూ ఫిల్మ్ ని అందించింది.

జూనియర్స్
అల్లరి నరేష్, శేరిన్ జంటగా నటించిన జూనియర్స్ మూవీ 2003లో విడుదలైంది.ఈ మూవీకి జె.పుల్లారావు( J.Pullarao ) దర్శకత్వం వహించారు…ఈ మూవీ ప్లాప్ అయింది.

కొత్త బంగారు లోకం
వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్( Varun Sandesh, Shweta Basu Prasad ) హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా కొత్త బంగారు లోకం.ఈ మూవీ 2008 లో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు…ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

చిత్రం
దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ మూవీలో ఉదయకిరణ్, రీమా సేన్( Udayakiran, Reema Sen ) జంటగా నటించారు.2000 వ సంవత్సరంలో ఈ మూవీ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది.బేసిగ్గా ఈ సినిమాతోనే కొంచం బోల్డ్ టైప్ లో ఉండే సినిమాలు వచ్చాయి అని చెప్పాలి…ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది.