లేడీ విలన్స్'గా భయపెట్టనున్న స్టార్ హీరోయిన్లు వీళ్ళే!

సినిమాలలో హీరో కి ఎంత క్రేజ్ ఉంటుందో.ఆ హీరోకి ఎదురుగా పోటీపడే విలన్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది.

 These Are The Star Heroines Who Will Be Scared As Lady Villains-TeluguStop.com

ఇక మామూలుగా విలన్స్ లలో మేల్ విలన్స్ వాళ్లే ఎక్కువగా ఉంటారు.ఇక ఇందులో హీరో, విలన్ కి మధ్య గట్టి పోటీ ఉన్న అది మామూలుగానే అనిపిస్తుంది.

కానీ అదే హీరోకి ఎదురుపడి పోటీలో విలన్ పాత్రలో లేడి విలన్ ఉంటే సినిమాల్లో ఆ క్రేజే వేరు ఉంటుంది.ఇక ఇప్పటికే అలనాటి సినిమాలలో సీనియర్ నటీమణులు రమ్యకృష్ణ, రాశి విలన్ పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే.

 These Are The Star Heroines Who Will Be Scared As Lady Villains-లేడీ విలన్స్’గా భయపెట్టనున్న స్టార్ హీరోయిన్లు వీళ్ళే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తాజాగా మరో యంగ్ స్టార్ హీరోయిన్స్ కూడా విలన్ పాత్రలో కనిపించనున్నారు ఇంతకీ వారెవరో చూద్దాం.

టాలీవుడ్ బ్యూటీ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ గురించి తెలీనోలే లేరు.

ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉండగా.ఇప్పటివరకు మంచి గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళంలో ‘సాని కాయిధం’ అనే సినిమాలో నటించనుందట.ఇక ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుండగా.

ఇందులో కీర్తి ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.

ఇక మిల్క్ బ్యూటీ తమన్నా ఈమధ్య సినిమాలలో అవకాశాలను అంతగా అందుకోకపోగా.

ప్రస్తుతం ఆమె నితిన్ తో కలిసి ‘మ్యాస్ట్రో‘ సినిమాలో నటిస్తుంది.ఇక ఈ సినిమా బాలీవుడ్ ‘అంధాధున్’ రీమేక్ అవ్వగా ఇందులో టబు చేసిన ప్రతినాయిక పాత్ర తమన్నా చేయనుంది.

ఇక ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్.ఇటీవలే విడుదలయిన అనగనగా ఓ అతిథి సిరీస్ లో నటించగా ఇందులో తన పాత్ర విలన్ పాత్ర ఉండగా.

ప్రస్తుతం ఆమె మరో ‘త్రీ రోజస్‘ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.ఇందులో కూడా విలన్ పాత్రలో నటించనుందట.

Telugu Keerthy Suresh, Lady Villains, Tamanna, Tollywood-Movie

అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉండగా.అందులో ‘ది ఫ్యామిలీ మెన్ 2‘ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇందులో నెగటివ్ షేడ్ పాత్రలో నటిస్తుంది సమంత.ఇక మరో బుల్లితెర యాంకర్ అనసూయ కుడా ‘పుష్ప’ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

#Lady Villains #Keerthy Suresh #Tamanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు