ఈ సెప్టెంబరు నెలలో మార్కెట్లోకి రాబోతున్న స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే.. కోనేయండి మరి!

నెలకో బ్రాండ్ మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది.అయినా నేటి యూత్ సరికొత్త మొబైల్ కోసం ఎదురు చూస్తూనే వుంటారు.

 These Are The Smartphones That Are Going To Be Released In The Market This Sept-TeluguStop.com

ఇంకా మనలో అనేకమంది నెలకొక మొబైల్ మార్చేవారు వున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.ఇకపోతే వినియోగదారులు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ మోడల్స్‌ వైపు మొగ్గుచూపుతుండటం వలన గత రెండేళ్ల కాలంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌తో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో విడులయ్యే వాటిలో ప్రీమియం, మిడ్‌రేంజ్‌ మోడల్స్‌ ఎక్కువగా ఉండేట్టు సదరు కంపెనీలు చూసుకుంటున్నాయి.

ఈ క్రమంలో సెప్టెంబరు నెలలో విడుదలవుతున్న మోడల్స్‌పై ఓ లుక్కేద్దాం!.

Moto Edge 30 Ultra: మోటో నుండి ఈ మోడల్ మొదటి వారంలో విడుదలకానుంది.ఫీచర్స్ విషయానికొస్తే, 200 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరా, 108 MP సెకండరీ కెమెరాతో పాటు మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి.144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు.స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ ఉపయోగించారు.144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే కలదు.స్నాప్‌డ్రాగన్‌ 888+ ప్రాసెసర్‌, 4,400 MAH బ్యాటరీ కలదు.

Xiaomi 12T Series: షావోమి 12 సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ మార్కెట్లోకి రానుంది.120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 2k అమోలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌, లైకా కెమెరా సెటప్‌, 4,500 MAH బ్యాటరీ.

iPhone 14 Series: యాపిల్‌ కంపెనీ ఐపోన్‌ 14 సిరీస్‌ను సెప్టెంబరు 7న విడుదల చేయబోతోంది.మొత్తం 4 మోడల్స్‌ రానున్నాయి.

వీటితోపాటు మూడు ఐపాడ్ మోడల్స్‌ను కూడా యాపిల్ విడుదల చేస్తుంది.

Asus Rog Phone 6 Ultimate Edition: 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 50 MP ప్రైమరీ కెమెరాతోపాటు ముందు 12 MP కెమెరా ఇస్తున్నారు.6,000 MAH బ్యాటరీ, 8జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో లభించనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube