సైన్స్ కి అంతుచిక్కని పూరి జగన్నాథ ఆలయ రహస్యాలు ఇవే..!

These Are The Secrets Of Puri Jagannath Temple That Are Elusive To Science

మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి.అలాంటి అద్భుతమైన దేవాలయాలలో ఎన్నో వింతలు, రహస్యాలు దాగి ఉన్నాయి.

 These Are The Secrets Of Puri Jagannath Temple That Are Elusive To Science-TeluguStop.com

ఇప్పటికి కూడా కొన్ని ఆలయాల్లో దాగి ఉన్న రహస్యాలను ఎవరు కనుగొనలేకపోయారు.ఈ విధమైనటువంటి సైన్సుకు దొరకని ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఆలయాలలో చార్ ధామ్ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ ఆలయ ఒకటి.

ప్రతి సంవత్సరం జరిగే ఈ పూరి జగన్నాథ రథోత్సవ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పూరి ఆలయం గురించి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.

 These Are The Secrets Of Puri Jagannath Temple That Are Elusive To Science-సైన్స్ కి అంతుచిక్కని పూరి జగన్నాథ ఆలయ రహస్యాలు ఇవే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సైన్స్ కి అంతుబట్టని రహస్యాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

పురాణాల ప్రకారం పాండవులు యమలోకానికి వెళుతున్న సమయంలో మోక్షానికి చేరువ చేసి ఈ పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించారని తెలుస్తోంది.నలభై ఐదు అంతస్తుల కలిగినటువంటి ఈ ఆలయంపై ప్రతినిత్యం జెండాను మారుస్తూ ఉండటం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం.

అదేవిధంగా ఈ ఆలయంపై ఉన్న జెండా గాలివీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూనే ఉంటుంది.అయితే ఈ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడానికి గల కారణం ఏమిటనే విషయం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం గానే మిగిలిపోయింది.

అదేవిధంగా పూరి జగన్నాథ ఆలయ పై భాగంలో 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు కలిగిన సుదర్శన చక్రాన్ని ప్రతిష్టించారు.అయితే ఈ సుదర్శన చక్రం ఏ మూల నుంచి చూసిన అందరికీ అభిముఖంగానే కనిపిస్తుంది.సాధారణంగా ఏ ఆలయానికి అయినా ఏ నిర్మాణానికై నా నీడ అనేది తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో భూమిపై పడుతుంది.కానీ ఈ పూరి జగన్నాథఆలయం నీడ ఏ సమయంలో కూడా భూమిపై పడదు.

ఇది ఇంజనీర్ల గొప్పతనం అనాలో లేక ఆ భగవంతుడి లీలలు అనాలో అర్థం కాని విషయం.అదేవిధంగా ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు.

అయితే ప్రతిరోజు ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని తయారుచేస్తారు అయితే ఏ రోజు కూడా ప్రసాదం తక్కువ రావడం కానీ, వృధాగా కాలేదు.అదేవిధంగా ఆలయ గోపురం పై భాగంలో ఎలాంటి పక్షులు కానీ, విమానాలు గానీ ప్రయాణించాక పోవడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు నిలయంగా ఉన్న ఈ పూరి జగన్నాథఆలయ రహస్యాలను ఛేదించడానికి కోసం ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు.

#PuriJagannath #ScienceElusive #Pandavas #FlagPuri #Secrets

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube