ఇంగ్లాండు తో టెస్ట్ సిరీస్ లో నమోదైన వివిధ రికార్డులు ఇవే..!

మొతేరా మైదానం వేదికగా జరిగిన ఇంగ్లాండ్, భారత్ నాలుగో టెస్టులో టీమ్ ఇండియా 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కి చేరుకున్న భారత్ లార్డ్స్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో తలపడనుంది.

 These Are The Records Established In India Vs England Test Series-TeluguStop.com

అయితే ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో పలు అవార్డులు, రికార్డులు నమోదయ్యాయి.అవేంటో ఈ ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం.

ఈ టెస్ట్ సిరీస్ లో భారత బౌలర్లు 25 మంది ఇంగ్లండ్ బ్యాట్ మెన్ లను ఎల్బి లు చేశారు.గతంలో మన ఇండియన్ క్రికెట్ బౌలర్లు ఒక సిరీస్ 24 ఎల్బి చేసి చరిత్ర సృష్టించారు.

 These Are The Records Established In India Vs England Test Series-ఇంగ్లాండు తో టెస్ట్ సిరీస్ లో నమోదైన వివిధ రికార్డులు ఇవే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఈ సారి ఆ రికార్డ్ ని చెరిపివేసి 25 వికెట్లను ఎల్బిల రూపంలో తీసి ఆశ్చర్యపరిచారు.నాల్గు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ ఓడిపోయి ఆ తర్వాత సిరీస్ కైవసం చేసుకోవటం టీమ్ ఇండియా కి ఇది మూడవసారి.

ఐతే 3, 4 టెస్ట్ సిరీస్స్ లలో తొలి మ్యాచ్ ఓడిపోయి సిరీస్ కైవసం చేసుకోవడం భారత్ కి ఇది ఆరవసారి.ఇటీవల జరిగిన ఇంగ్లాండ్, ఇండియా టెస్ట్ సిరీస్ తో భారత గడ్డపై విరాట్ కోహ్లీ నాయకత్వంలో 23 టెస్టుల్లో టీం ఇండియా గెలిచింది.

దీనితో సొంతగడ్డపై అత్యధిక టెస్ట్ మ్యాచులు గెలిచిన క్రికెట్ కెప్టెన్ లలో విరాట్ కోహ్లీ మూడవ స్థానానికి ఎగబాకారు.

Telugu Axar Patel, England, India, Joe Root, New Records, Ravichandran Ashwin, Rohith Sharma, Sports Updates, Test Series, Various Records, Virat Kohli-Latest News - Telugu

మొదటి మూడు టెస్ట్ మ్యాచ్ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అక్షర్ పటేల్ నాలుగవ స్థానాన్ని దక్కించుకున్నారు.ఇకపోతే రవిచంద్రన్ అశ్విన్ నాలుగు మ్యాచులలో 31 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రిషబ్ పంత్, ఆఫ్ ది సిరీస్ అవార్డు రవిచంద్రన్ అశ్విన్ గెలుచుకున్నారు.

ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ జో రూట్ 368 పరుగులు చేసి అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించారు.రోహిత్ శర్మ 43 బౌండరీలతో అత్యధిక బౌండరీలు సాధించిన ప్లేయర్ గా నిలిచారు.

రహానే మరియు పంత్ 8 క్యాచ్లు పట్టి అత్యధిక క్యాచ్ లు పట్టిన ప్లేయర్లు గా నిలిచారు.

#New Records #Sports Updates #Test Series #Axar Patel #India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు