ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డులు ఇవే..!

ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్( Asia Cup ) రెండు టోర్నీలు విరాట్ కోహ్లీకి ఎంతో కీలకం.ఫామ్ ను కనుగొని అదే రిథమ్ లో బ్యాట్ తో పరుగులు చేయాల్సి ఉంటుంది.

 These Are The Records Created By Virat Kohli In The Asia Cup..! , Virat Kohli ,-TeluguStop.com

అయితే ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల దృష్టి అంత విరాట్ కోహ్లీ పైనే ఉంది.విరాట్ కోహ్లీ( Virat Kohli ) ఇప్పటివరకు 275 వన్డే మ్యాచ్లు ఆడి 57.32 సగటుతో 46 సెంచరీలు, 65 అర్థ సెంచరీలతో 12,898 పరుగులు చేశాడు.ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.2022 టోర్నమెంట్ అతనికి అద్భుతంగా ఉంది.యూఏఈ లో టీ20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ 5 ఇన్నింగ్స్ లలో 92 సగటుతో 147.59 స్ట్రైక్ రేట్ తో 276 పరుగులు చేశాడు.పేలవ ఫామ్ లో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ.

ఇక్కడ భారీ స్కోరును కలెక్ట్ చేసి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.

Telugu Afghanistan, Asia Cup, Latest Telugu, Mews, Sri Lanka, Virat Kohli-Sports

2022 ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై సెంచరీ( Afghanistan ) చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తన 1000 రోజుల సెంచరీ కరువును అధమికమించాడు.ఆరు మ్యాచ్లలో 296 పరుగులు చేశాడు.విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో భారత తరఫున 11 వన్డే మ్యాచ్లు ఆడాడు.మూడు సెంచరీలతో 61.30 సగటుతో 613 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.విరాట్ కోహ్లీ 2010లో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ లో 11, 18, 10, 28 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచి, 2012లో మిర్పూర్ లో శ్రీలంక పై 108 పరుగులు, మిర్పూర్ లో పాకిస్తాన్ పై 183 పరుగులు, 2014లో ఫతుల్లా లో బంగ్లాదేశ్ పై 136 పరుగులు చేశాడు.

Telugu Afghanistan, Asia Cup, Latest Telugu, Mews, Sri Lanka, Virat Kohli-Sports

ఆసియా కప్ టీ20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ రికార్డు సాధించాడు.పది మ్యాచ్లలో 85.80 సగటుతో 429 పరుగులు చేశాడు.యూఏఈ లో 2022 ఎడిషన్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 61 బంతుల్లో 122 పరుగులు చేశాడు.2016 ఎడిషన్ లో శ్రీలంక( Sri Lanka )తో జరిగిన మ్యాచ్లో 139 పరుగుల చేజింగ్ లో 47 బంతుల్లో అజేయంగా 56 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.ప్రస్తుతం భారత అభిమానులు ఈ ఏడాది జరిగే టోర్నీ లలో విరాట్ కోహ్లీ పైనే ఆశలు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube