ఈటెల గెలిచేందుకు ఇవన్నీ కారణాలే ?

హుజురాబాద్ ఉప ఎన్నికలు అధికార పార్టీ టిఆర్ఎస్ కు తీవ్ర నిరాశ కలిగించాయి.అసలు తెలంగాణ అధికార పార్టీ గా గెలుపు తమ వైపు ఉంటుందనే నమ్మకం తో కేసీఆర్ , కేటీఆర్ వంటివారు భావించారు.

 These Are The Reasons Why Ethela Rajender Won In Huzurabad Constituency Etela Ra-TeluguStop.com

ఈటెల రాజేందర్ పై సానుభూతి పనిచేయదని , ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమను గెలిపిస్థాయి అని టిఆర్ఎస్ నమ్మకంతో ఉంటూ వచ్చింది.అయినా ఏదో అనుమానం ఉండడంతోనే దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు ఈ పథకం ద్వారా సులువుగా ఆ సామాజిక వర్గం ఓట్లను తమవైపు తిప్పుకోవచ్చని అంచనా వేశారు.

కానీ అన్ని విషయాల్లోనూ అధికార పార్టీ టిఆర్ఎస్ కు నిరాశే ఎదురైంది.ఈటెల రాజేందర్ ఘనవిజయం సాధించడంతో ఒక్కసారిగా టిఆర్ఎస్ శ్రేణులు డీలా పడ్డాయి.

గతంలో హుజూరాబాద్ నియోజకవర్గం లో వచ్చిన మెజారిటీ ఇప్పుడు రాకపోయినా, విజయ దక్కించుకోవడం మాత్రం రాజేందర్ కు ఆనందాన్ని కలిగిస్తోంది.

    అసలు రాజేందర్ గెలుపుకు కారణాలను ఒకసారి విశ్లేషిస్తే   1.టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకోసం కష్ట పడటం , తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడం, కెసిఆర్ తరువాత పార్టీలో హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఆ స్థాయిలో ప్రాధాన్యం పొందినా అవమానకర రీతిలో రాజేందర్ ను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేసి, కేసులు నమోదు చేయడం.
  2.రాజేందర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత బీజేపీలో చేరడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఇక అప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ, పూర్తిగా నియోజకవర్గంలోనే ఉంటూ పాదయాత్ర చేపట్టడం, పాత పరిచయాలు , ప్రజలకు సుపరిచితులు కావడం ఇవన్నీ కలిసి వచ్చాయి.
  3.రాజేందర్ బిజెపిలో చేరినా, ఆయనను బీజేపీ నేతగా కాకుండా , రాజేందర్ గా ప్రజలు గుర్తించుకోవడం, వ్యక్తిగత ఇమేజ్ ఇవన్నీ కలిసి వచ్చాయి.
 

Telugu Bjp, Etela Rajendar, Etela Rajender, Gellusrinivas, Hareesh Rao, Hujuraba

4.కేంద్రం పరిధిలోని గ్యాస్ పెట్రోల్ ధరల పెరుగుదల ప్రభావం రాజేందర్ పై పడే విధంగా టీఆర్ఎస్ ఎంతగా ప్రయత్నం చేసినా, ఓటర్లు పట్టించుకోకపోవడం .
 

Telugu Bjp, Etela Rajendar, Etela Rajender, Gellusrinivas, Hareesh Rao, Hujuraba

5.టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒకప్పుడు రాజేందర్ కు ప్రధాన అనుచరుడు కావడం, రాజేందర్ పరపతి ముందు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రభావం కనిపించకపోవడం.
  6.టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసినా, మిగతా కులాల్లో ఈ పథకం అమలుపై అసంతృప్తి చెలరేగడం ఇవన్నీ ఈటెల రాజేందర్ కు కలిసి రాగా, టీఆర్ఎస్ అభ్యర్దిని ఓటమి వైపు నడిపించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube