"మెయిల్” హీరోయిన్ గురించి మీకు తెలియని అసలు నిజాలు ఇవే..!?

ఇటీవల ఆహాలో విడుదలై సూపర్ హిట్ అయిన సిరీస్ మెయిల్.ఈ సినిమాను ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ప్రజలు దాని వాడకం తెలిసీ తెలియక ఎలా ప్రవర్తించారనే కథాంశంతో దర్శకుడు ఉదయ్ గుర్రాల హాస్య భరితంగా, మనసుకు హత్తుకునేలా ‘మెయిల్‌’ను రూపొందించారు.

 Unknown Facts About Mail Movie Fame Gowri Priya Reddy, Mail Movie, Gowri Priya R-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మెయిల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.సింగర్‌గా శభాష్‌ అనిపించుకొని బ్యూటీ కాంటెస్టెలలో భేష్‌గా నిలిచి మెయిల్‌.

అంటూ ఓటీటీ సినిమాతో రోజాగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది గౌరి ప్రియారెడ్డి.

ఈ సినిమాలో హీరోయిన్ గా గౌరి ప్రియా రెడ్డి నటించారు.

అయితే గౌరి ప్రియా రెడ్డి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దమా.గౌరి ప్రియా రెడ్డి బేగంపేటలోని సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ చదివారు.

తండ్రి పేరు శ్రీనివాస్ రెడ్డి తల్లి పేరు వసుంధర.గౌరి ప్రియ మిస్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకున్నారు.

గౌరీ ప్రియ మంచి సింగర్.ఆమె అలాగే లలిత సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్నారు.

సాక్షి ఎరీనా యూత్ సింగింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచారు.ఇక జెమినీ టీవీలో కొంతకాలం యాంకర్ గా పని చేశారు.

ఇక బోల్ బేబీ బోల్ ప్రోగ్రాంలో రెండవ సీజన్ లో రెండవ స్థానంలో, మూడవ సీజన్ లో మొదటి స్థానంలో నిలిచింది ఈ భామ.

Telugu Aha Ott, Anchor, Background, Bol Baby Bol, Fidaa, Mail, Hyderabad, Ott Pl

ఈ అమ్మడు ఎంతో మంది ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి స్టేజ్ షోస్ కూడా ఇచ్చారు.ఇక తేజ దర్శకత్వంలో వచ్చిన హోరాహోరీ సినిమాలో ఒక పాట పాడారు.నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా సినిమాల్లో నటించారు.

అలాగే చాయ్ బిస్కెట్ వాళ్ల గర్ల్ ఫార్ములా వీడియోస్ లో కూడా నటించారు.ఇక మెయిల్ లో లీడ్ రోల్ లో కనిపించారు.

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో గౌరి ప్రియా రెడ్డికి మంచిది గుర్తింపు వచ్చింది అనే చెప్పాలి.ఈ సందర్బంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

తను ఇప్పుడు చాల సంతోషంగా ఉన్నట్లు తెలియజేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube