Premium Phones :యువత మెచ్చే అత్యాధునిక ఫీచర్లు ఉన్న ప్రీమియం ఫోన్లు ఇవే..

ఖరీదైన టాప్ ఎండ్ ప్రీమియం ఫోన్లను కొనుగోలు చేయాలని అందరికీ ఉంటుంది.అయితే ఏది కొనాలో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు.

 These Are The Premium Phones With Advanced Features That The Youth Like ,  Premi-TeluguStop.com

అయితే ఏ ఫోన్ కొంటున్నా, అందులోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలాంటివో తెలుసుకోవాలి. ఏవి మనకు బాగా ఉపయోగపడతాయో అంచనా వేసుకోవాలి.

ఈ తరుణంలో ఎక్కువ మంది యూజర్లు గూగుల్ పిక్సెల్ 7 ప్రో, ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మాక్స్, శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ వంటి ఫోన్లు చక్కటి ఫీచర్లతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.ఇలాంటి ఫోన్ల జాబితాను, వాటిలోని ఫీచర్లను తెలుసుకుందాం.

Telugu Phone, Premium, Ups-Latest News - Telugu

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కొనాలనుకునే ఫోన్లు యాపిల్ ఐ ఫోన్లు.ఇందులో ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ రూ.1,39,900 ధరకు అందుబాటులో ఉంది.స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్, పర్పుల్ రంగులలో లభిస్తోంది.ఇది 1 టీబీ వరకు స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంది.6.7-అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డిఆర్ డిస్ ప్లే ఉంది.ఇందులో 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో ఆపిల్ A16 బయోనిక్ చిప్ అమర్చారు.

రెండు 12 ఎంపీ సెన్సార్లతో కూడిన 48 ఎంపీ కెమెరా వెనుక భాగంలో ఉంటుంది.సెల్ఫీల కోసం ముందు భాగంలో 12 ఎంపీ ట్రూ డెప్త్ కెమెరా ఉంది.

ఇది నీటిలో పడినా పాడవదు.గరిష్టంగా 6 మీటర్ల లోతులో పడినా, 30 నిమిషాల వరకు వాటర్ రెసిస్టెన్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఆ తర్వాతి స్థానంలో శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 4 ఫోన్ ఉంది.దీని ధర రూ.1,54,999.దీని డిస్ ప్లే 7.6-అంగుళాలతో AMOLED మెయిన్ డిస్ ప్లే ఉంటుంది.ఫోల్డబుల్ డిజైన్‌ను కలిగి ఉంది.

దీనికి S పెన్ సపోర్ట్‌గా ఉంటుంది.గ్రేగ్రీన్, ఫాంటమ్ బ్లాక్, లేత గోధుమరంగు రంగులలో లభిస్తుంది.

ఇందులో 12 GB ర్యామ్‌ ఉంది.ఈ ఫోన్ కెమెరా సెన్సార్లలో వెనుక భాగంలో 50 ఎంపీ, 12 ఎంపీ, 10 ఎంపీ కెమెరాలు ఉన్నాయి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే ఫోన్లలో గూగుల్ పిక్సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి.ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 7 ప్రో అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులో ఉంది.దీని ధర దేశంలో రూ.84,999గా ఉంది.ఇందులో గూగుల్ టెన్సర్ జి 2 చిప్‌సెట్ అమర్చబడి ఉంది.3120 x 1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల క్వాడ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంది.స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 48 ఎంపీ, 12 ఎంపీ సెన్సార్లతో కూడిన 50 ఎంపీ కెమెరాను కలిగి ఉంది.ముందు భాగంలో సెల్ఫీల కోసం 10.8 ఎంపీ కెమెరా అమర్చారు.4,926 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.ఆపిల్ ఐఫోన్ 14 కూడా ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకుంటోంది.ఇందులో 2532×1170 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డిఆర్ డిస్ ప్లే కలిగి ఉంది.ఇందులో ఏ15 బయోనిక్ చిప్‌సెట్ అమర్చారు.మిడ్ నైట్, పర్పుల్, స్టార్ లైట్, రెడ్, బ్లూ కలర్లలో లభిస్తోంది.ఇందులో స్టోరేజీని బట్టి 128 జీబీ, 256 జీబీ, 512 జీబీతో ఫోన్లు ఉన్నాయి.12 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ కెమెరా, 12 ఎంపీ మెయిన్ సెన్సార్ కెమెరా ఉన్నాయి.సెల్ఫీల కోసం ముందు భాగంలో 12 ఎంపీ ట్రూడెప్త్ కెమెరా అమర్చారు.దీని ధర రూ.79,900తో ప్రారంభం అవుతుంది.ఇవే కాకుండా శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా ఫోన్ కూడా ఎక్కువ మందిని ఆకట్టుకునే ఫోన్‌గా పేరొందింది.దీని ప్రారంభ ధర రూ.1,09,999.ఇది బుర్గుండి, ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, గ్రీన్ కలర్‌లలో లభిస్తుంది.6.8-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్ ప్లేని కలిగి ఉంది.దీనికి S పెన్ సపోర్ట్ చేస్తుంది.

ఇందులో 10 ఎంపీ, 12 ఎంపీ, 10 ఎంపీ సెన్సార్లతో కూడిన 108 ఎంపీ కెమెరాను కలిగి ఉంది.ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube