చంద్రగ్రహణం రోజు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు.ఆ రోజున దేవాలయాలు భక్తుల సందడితో కిటకిటలాడుతుంటాయి.

 These Are The Precautions To Be Taken On The Day Of The Lunar Eclipse-TeluguStop.com

పెద్ద ఎత్తున భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.పౌర్ణమి రోజు పేదలకు దానధర్మాలు చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

అయితే ఎప్పటిలాగా కాకుండా ఈసారి కార్తీకపౌర్ణమితో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది.కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడటంవల్ల ఈ పౌర్ణమి మరింత ప్రాధాన్యత కలిగినది.

 These Are The Precautions To Be Taken On The Day Of The Lunar Eclipse-చంద్రగ్రహణం రోజు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికీ ఈ సంవత్సరంలో పలు చంద్ర గ్రహణాలు పూర్తయ్యాయి.అయితే కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడే చంద్రగ్రహణం ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.అయితే ఈ చంద్ర గ్రహణం మన దేశంలో కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పాక్షికంగా ఏర్పడుతుంది.చంద్రగ్రహణం ఏర్పడటంవల్ల ఇంట్లో గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు పాటించ వలసిన అవసరం ఉంటుంది.

గ్రహణం అనే పేరు వినగానే కొందరు చిరు గా ఆలోచిస్తారు.

ఈనెల 30వ తేదీ కార్తీక పౌర్ణమి కావడంతో చంద్రగ్రహణం1:40 మంచి సాయంత్రం5:22 ఈ మధ్యకాలంలో పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.ఈ చంద్ర గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.గర్భిణీ స్త్రీల పై ప్రమాదకరమైన కిరణాలు పడటం వల్ల పుట్టబోయే బిడ్డలో అవయవ లోపం ఏర్పడుతుందని గర్భిణీ స్త్రీలను బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి.

అంతేకాకుండా గ్రహణం ఉన్న సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలను సేవించకూడదు.గ్రహణ సమయంలో నిద్రపోవడం చేయకూడదు.ఈ గ్రహణ సమయంలో మనసులో ఇష్టదైవాన్ని జపిస్తూ పూజించటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

అలాగే గ్రహణం ఏర్పడే సమయంలో మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలలో గరిక వేయడం వల్ల గ్రహణ సమయంలో ఏర్పడే అతి ప్రమాదకరమైన కిరణాల నుంచి మనల్ని కాపాడుతుంది.అలాగే గ్రహణ సమయంలో బ్రహ్మదండు చెట్టు తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టడంవల్ల శుభం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు

.

#Lunar Eclipse #Lunar Eclipse #Lunar Eclipse

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL