Banks High Interest: ప్రజలు డిపాజిట్ చేసే డబ్బుకు అధిక వడ్డీ ఇచ్చే ప్రముఖ బ్యాంకులు ఇవే..

రేపో రేట్ పెరగడం వల్ల ఈ రోజుల్లో ఎఫ్‌డీ డిపాజిట్లు ఉన్నవారికి అధిక రాబడి లభిస్తోంది.ఇంకా ఎఫ్‌డీలో డిపాజిట్ చేయని వారికి ఇంతకంటే మించిన సమయం మళ్లీ రాదని చెప్పొచ్చు.

 These Are The Popular Banks That Offer High Interest On Deposit Money Details, B-TeluguStop.com

ఎందుకంటే ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై కళ్ళు చెదిరే వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.ఆ బ్యాంక్స్‌పై ఇప్పుడొక లుక్కేద్దాం.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

సీనియర్ సిటిజన్స్‌ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో ఎఫ్‌డీ డిపాజిట్స్‌పై 9 శాతం వడ్డీ రేటు పొందొచ్చు.ఈ వడ్డీ రేటు 181 రోజులు, 501 రోజుల టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది.సాధారణ ప్రజలకు ఈ కాల వ్యవధులలో 8.5 శాతం వడ్డీ లభిస్తుంది.

ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీలపై 4.5-8.5 శాతం వరకు వడ్డీని అందజేస్తోంది.సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాల పరిమితితో ఎఫ్‌డీ డిపాజిట్స్‌ చేయవచ్చు.కాగా బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 999 రోజుల టెన్యూర్‌పై 8.5 శాతం వడ్డీని. సాధారణ ప్రజలకు 8 శాతం వడ్డీని అందిస్తోంది.

Telugu Banks, Esaf Bank, Fd, Fd Deposits, Financial Tips, Fincare, Interest Rate

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌కు 0.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.సీనియర్ సిటిజన్స్ గరిష్ఠంగా 8.75% వడ్డీ పొందొచ్చు.560 రోజుల ఎఫ్‌డీలకు ఈ రేటు లభిస్తుంది.

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఫిన్‌కేర్ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌కు 0.5 శాతం ఇంట్రెస్ట్‌ను అందిస్తోంది.ఈ బ్యాంక్‌లో గరిష్ఠంగా 8.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుంది.1,000 రోజుల ఎఫ్‌డీలకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube