ఏపీలో అటూ ఇటూ కాకుండా పోయిన టాప్ పొలిటిషీయ‌న్స్‌...!- These Are The Politicians Who Lose Their Political Future In Ap

these are the politicians who lose their political future in ap , ap , ap political news, latest news, political future. political stratagies, ganta srinivasa rao, TDP, ysrcp, bjp, rapaka vara prasad, janasena - Telugu Ap, Ap Political News, Bjp, Ganta Srinivasa Rao, Janasena, Latest News, Political Future.political Stratagies, Rapaka Vara Prasad, Tdp, Ysrcp

రాజ‌కీయాల్లో క‌రెక్టు టైంలో క‌రెక్ట్ స్టెప్ వేయ‌డంలోనే స‌గం స‌క్సెస్ ఉంటుంది.చాలా మంది నేత‌లు ఏళ్ల‌కు ఏళ్లుగా ఒక పార్టీలో ఉండి.

 These Are The Politicians Who Lose Their Political Future In Ap-TeluguStop.com

చివ‌ర‌కు అధికారంలోకి వ‌చ్చే టైంలో మ‌రో పార్టీలోకి మారుతుంటారు.అలాంట‌ప్పుడు వారి దుర‌దృష్టం మామూలుగా ఉండ‌దు.

ఇక అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్షంలో ఉన్న వాళ్లు… ఎన్నిక‌ల వేళ అధికారంలోకి వ‌చ్చే పార్టీలోకి మారిపోయి అక్క‌డ అధికారం ఎంజాయ్ చేస్తుంటారు.మ‌రి కొంద‌రు నేత‌లు అప్ప‌టి వ‌ర‌కు ఓ పార్టీలో అధికారం అనుభ‌వించి.

 These Are The Politicians Who Lose Their Political Future In Ap-ఏపీలో అటూ ఇటూ కాకుండా పోయిన టాప్ పొలిటిషీయ‌న్స్‌…-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్నిక‌ల్లో అధికారంలో వ‌స్తుంద‌నుకున్న పార్టీలోకి మారి అక్క‌డ కూడా గెలిచి.అక్క‌డ కూడా అధికారంలోనే ఉంటారు.

ఉదాహ‌ర‌ణ‌కు గంటా శ్రీనివాస‌రావు 2014కు ముందు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్నారు.ఆ ఎన్నిక‌ల్లో టీడీపీలోకి జంప్ చేసి ఇక్క‌డ కూడా మంత్రి అయ్యి ఏడెనిమిదేళ్ల పాటు మంత్రిగా ఎంజాయ్ చేశారు.

ఇక అదే జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్ టీడీపీలో ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్నారు.ఇప్పుడు వైసీపీలోకి వ‌చ్చి మంత్రి అయ్యి .ఇక్క‌డ కూడా గ్యాప్ లేకుండా అధికారం అనుభ‌విస్తున్నారు.కొంద‌రు నేత‌లు మాత్రం స‌రైన టైంలో స‌రైన స్టెప్ వేయ‌లేక రెండిటికి చెడ్డ రేవ‌డిలా మారిపోతుంటారు.

Telugu Ap, Ap Political News, Bjp, Ganta Srinivasa Rao, Janasena, Latest News, Political Future.political Stratagies, Rapaka Vara Prasad, Tdp, Ysrcp-Telugu Political News

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి ద‌గ్గ‌రైన వారిలో రాపాక వరప్రసాద్ ( ఈయ‌న మాత్రం జ‌న‌సేన‌) వల్లభనేని వంశీ కరణం బలరాం వాసుపల్లి గణేష్ మద్దాలి గిరి పార్టీ మారినా వారికి ఇక్క‌డ స‌రైన గుర్తింపు లేదు.పోనీ అటు తిరిగి వెళ‌దామ‌న్నా అక్క‌డకు వీళ్ల‌ను రానిచ్చే ప‌రిస్థితి లేదు.ఇక గ‌తంలో ఓ వెలుగు వెలిగిన వారిలో తోట త్రిమూర్తులు – శిద్దా రాఘవరావు – ఆకుల సత్యనారాయణ – కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ – యామినీ బాల – శమంతకమణి ప‌రిస్థితి కూడా ఇప్పుడు వైసీపీలో అటూ ఇటూ కాకుండా ఉంది.

ఏ మాత్రం వ్య‌క్తిగ‌త ఇమేజ్ లేని ఈ నేత‌ల రాజ‌కీయం భ‌విష్య‌త్తులో ఉంటుందా ? ఇక్క‌డితోనే వీరి పొలిటిక‌ల్ కెరీర్‌కు తెర‌ప‌డుతుందా ? అన్న‌ది కూడా చూడాలి.ఇక య‌ర్ర‌గొండ‌పాలెం మాజీ ఎమ్మెల్యే పాల‌ప‌ర్తి డేవిడ్ రాజు, క‌ర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహ‌న్‌రెడ్డి, బుట్టా రేణుక లాంటి వాళ్ల‌ను కూడా ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

ఏదేమైనా ఈ నేత‌ల రాంగ్‌స్టెప్పే వీరి పొలిటిక‌ల్ కెరీర్‌కు శుభం కార్డు వేసేసింది.

#Janasena #Ysrcp #GantaSrinivasa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు