2021లో బాక్స్ బద్దలు కొట్టే సినిమాలు ఇవే!

అందరూ2019 వ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2020 సంవత్సరానికి ఎంతో ఘనంగా స్వాగతం పలికారు.ముఖ్యంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు ఈ సంవత్సరం పై ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రముఖ హీరోల సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.

 These Are The Movies That Will Release In 2021, Movies In 2021, Tollywood, Achar-TeluguStop.com

కరోనా మహమ్మారి వీరి ఆశలపై నీటిని చల్లింది.కరోనా విజృంభించడంతో భారీ సినిమాలన్నీ విడుదలకు నోచుకోకుండా వాయిదా పడుతున్నాయి.

అయితే కరోనా నిబంధనలు సడలించిన తర్వాత షూటింగ్ జరుపుకొని 2021 వ సంవత్సరంలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.అయితే 2021లో విడుదల కాబోయే సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.

1) కేజిఎఫ్ 2: కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజిఎఫ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.కేజిఎఫ్ కొనసాగింపుగా ప్రస్తుతం “కేజిఎఫ్ 2”చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం కోసం దేశమంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Telugu Acharya, Kgf, Pushpa, Radheshyam, Tollywood, Vakilsaab-Movie

2) ఆచార్య: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.2021 సంవత్సరంలో భారీ సినిమాలలో ఆచార్య ఒకటని చెప్పవచ్చు.

Telugu Acharya, Kgf, Pushpa, Radheshyam, Tollywood, Vakilsaab-Movie

3) వకీల్ సాబ్: కొంత కాలం పాటు రాజకీయాల్లో బిజీగా ఉండి సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

4) పుష్ప: ఈ ఏడాది ప్రారంభంలో అలా వైకుంఠపురం తో విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తరువాత పుష్ప అనే సినిమాలో నటిస్తున్నారు.2021 సంవత్సరంలో పుష్ప కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం అని చెప్పవచ్చు.

5) రాదే శ్యామ్: బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది.ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నారు.ప్రభాస్ నటిస్తున్న రాదే శ్యామ్ 2021 సంవత్సరంలో భారీ చిత్రం అని చెప్పవచ్చు.

Telugu Acharya, Kgf, Pushpa, Radheshyam, Tollywood, Vakilsaab-Movie

6)BB3: దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రంగా BB3 అని చెప్పవచ్చు.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో విడుదలైన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాయి అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే మూడవ చిత్రం పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

7) లవ్ స్టోరీ: మజిలీ సినిమా విజయం అందుకున్న తర్వాత అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమా కూడా 2021 బరిలో దిగనుంది.
ఇవే కాకుండా మరికొంతమంది హీరోల నటించిన చిత్రాలు ఈ 2021 సంవత్సరం లో విడుదల కానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube