సినిమా ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా సెట్స్ మీదకు వెళ్లని మూవీలు ఇవే!

టాలీవుడ్ డైరెక్టర్లు ఫుల్ ఫామ్ లో ఉండడంతో ప్యాండమిక్ తర్వాత కూడా ఉత్సాహంతో పని చేస్తున్నారు.అయితే సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఈ డైరెక్టర్స్ ప్రాజెక్ట్స్ ప్రకటించి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 These Are The Movies That Will Not Go On The Sets, Ntr, Naga Chaitanya, Allu Arjun, Pushpa, Pawan Kalyan,tollywood,prashant Neel , Venu Sriram,harish Shankar,parashuram,koratala Siva , Buchibabu Sana-TeluguStop.com

అధికారికంగా ప్రకటించినప్పటికీ సినిమాలు మాత్రం సెట్స్ మీదకు వెళ్ళడానికి ఏళ్ల సమయం పడుతుంది.మరి ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్లో పొందుతున్నాడు.ఇప్పటికే ఈయన కొరటాల శివతో, ప్రశాంత్ నీల్ తో వరుస సినిమాలు ప్రకటించాడు.అయితే బుచ్చిబాబు సానా ప్రాజెక్ట్ మాత్రం ఇంకా ప్రకటన రాలేదు.ఉప్పెన సక్సెస్ తర్వాత ఈయన ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేసాడు.

 These Are The Movies That Will Not Go On The Sets, NTR, Naga Chaitanya, Allu Arjun, Pushpa, Pawan Kalyan,tollywood,Prashant Neel , Venu Sriram,Harish Shankar,Parashuram,koratala Siva , Buchibabu Sana-సినిమా ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా సెట్స్ మీదకు వెళ్లని మూవీలు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ ప్రాజెక్ట్ పై దర్శక నిర్మాతలు హింట్ ఇచ్చారు.

అయితే తారక్ మాత్రం ఈ సినిమాను ఇంకా ప్రకటించలేదు.దీంతో ఈయన ప్రశాంత్ నీల్ తర్వాత అయినా ఈయనతో చేస్తాడో లేదో చూడాలి.

అక్కినేని నాగ చైతన్య వరుస సూపర్ హిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఈయన ప్రెసెంట్ నటించిన థాంక్యూ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.అయితే చైతూ ఎప్పుడో పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమాకు సైన్ చేసాడు.ఈ సినిమాను స్టార్ట్ చేసారు కూడా.అయితే పరశురామ్ మహేష్ బాబుతో అవకాశం రావడంతో ఈ సినిమాను పక్కన పెట్టేసాడు.దీంతో ఈ సినిమా ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.

ఇటీవలే పరశురామ్ సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు చైతూతోనే సినిమా చేస్తానని ప్రకటించాడు.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు.వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లతో రెండు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈయనతో హరీష్ శంకర్ ఒక సినిమా ప్రకటించాడు.భవదీయుడు భగత్ సింగ్ ను హరీష్ శంకర్ ప్రకటించి ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేసాడు.అయితే ఈ సినిమా ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సెట్స్ మీదకు మాత్రం వెళ్ళలేదు.

పుష్ప సినిమాతో అటు అల్లు అర్జున్ ఇటు సుకుమార్ ఇద్దరు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యారు.ఈ సినిమా పార్ట్ 1 తోనే ముగిసి పోలేదు.పార్ట్ 2 కూడా తెరకెక్కుతోందని ఎప్పుడో ప్రకటించారు.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న ఇంకా పార్ట్ 2 స్టార్ట్ చేయలేదు.అలాగే అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా ప్రకటించి ఏళ్ళు గడుస్తుంది.

అయినా కూడా ఈ సినిమా ఇంకా ఉందో లేదో కూడా తెలియడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube