ప్రపంచంలో ఎందరికో 2020 సంవత్సరం చాలా బాధగా, భయంగా గడిచిందని చెప్పవచ్చు.ఎట్టకేలకు చూస్తుండగానే 2020 సంవత్సరం పూర్తి కాబోతోంది.
కరోనా వైరస్ వల్ల 2020 సంవత్సరం మానవాళికి ఎంతో గుర్తుండిపోతుంది.ముఖ్యంగా సినీ పరిశ్రమకు ఎంతగానో గుర్తుండిపోతుంది.
సినిమాలు లేకపోవడం, నటించడానికి అవకాశం లేకపోవడం, అంతేకాకుండా కరోనా వైరస్ వల్ల సినీ పరిశ్రమలో ఎందరో ప్రముఖులు ఇబ్బందులకు గురి కావడం.అంతేకాకుండా మరికొందరు చనిపోవడం లాంటి బాధాకరమైన విషయాలు జరిగాయి.
తాజాగా సెర్చ్ ఇంజన్ యాహూ వేదికగా నెటిజెన్స్ ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ సెలబ్రెటీల వివరాలను తాజాగా వెల్లడించింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
2020 సంవత్సరం లో చాలామంది ఇంట్లోనే ఉండిపోవడంతో ఎక్కువగా స్మార్ట్ ఫోన్ లలో మునిగిపోయారు.ఇందులో భాగంగానే అనేక మంది వివిధ అంశాలపై అంతర్జాలంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెతికి తెలుసుకున్నారు.
అయితే ఈ సంవత్సరం గాను భారతీయులు ఎక్కువగా వెతికిన సెలబ్రిటీల వివరాలకు వస్తే.మొదటి స్థానంలో అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని సినీ ప్రపంచానికి షాక్ ఇచ్చిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ఎక్కువగా వెతికారు.
ఆ తర్వాత వరుసగా అమితాబచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సోను సూద్, అనురాగ్ కశ్యప్, అల్లు అర్జున్ లు వరుసగా ఉన్నారు.
యాహూ సంస్థ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ లిస్ట్ ను విధుల చేస్తుంది.
ఈ సంవత్సరం అత్యధికంగా వెతికిన సెలెబ్రెటీల విష్యం లో టాప్ 10 లో ఇద్దరు మాత్రమే మన తెలుగు వ్యక్తులు ఉండడం గమనార్హం.