జుట్టు త‌డిగా ఉన్న‌ప్పుడు అస్స‌లు చేయ‌కూడ‌ని పొర‌పాట్లు ఇవే!

These Are The Mistakes That Should Not Be Made At All When The Hair Is Wet

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రినీ ఏదో ఒక జుట్టు సంబంధిత స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.వాటిని నివారించుకునేందుకు ఖ‌రీదైన నూనెలు, షాంపూలు వాడ‌తారే త‌ప్ప‌.

 These Are The Mistakes That Should Not Be Made At All When The Hair Is Wet-TeluguStop.com

జుట్టు విష‌యంలో తాము చేస్తున్న‌ పొర‌పాట్ల గురించి మాత్రం ప‌ట్టించుకోనే ప‌ట్టించుకోరు.ముఖ్యంగా జుట్టు త‌డిగా ఉన్న‌ప్పుడు చేసే పొర‌పాట్ల వ‌ల్ల ఎన్నో ఇబ్బందుల‌ను ప‌డాల్సి వ‌స్తుంది.

అందుకే త‌ల స్నానం చేశాక త‌డి జుట్టు విష‌యంలో కొన్ని కొన్ని పొర‌పాట్ల‌ను అస్స‌లు చేయ‌రాదు.మ‌రి లేటెందుకు ఆ పొర‌పాట్లు ఏంటో చూసేయండి.

 These Are The Mistakes That Should Not Be Made At All When The Hair Is Wet-జుట్టు త‌డిగా ఉన్న‌ప్పుడు అస్స‌లు చేయ‌కూడ‌ని పొర‌పాట్లు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Care, Care Tips, Latest, Long, Wet-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

సాధార‌నంగా కొంద‌రు నిద్ర పోయే ముందు త‌ల స్నానం చేసి త‌డి జుట్టుతో నిద్రిస్తుంటారు.కానీ, ఇలా చేయ‌డం వ‌ల్ల హెయిర్ ఫాల్ స‌మ‌స్య విపరీతంగా పెరిగి పోతుంది.అందుకే ఎప్పుడూ జుట్టును బాగా ఆర‌బెట్టుకున్న త‌ర్వాతే నిద్రించాలి.

అలాగే చాలా మంది తెలిసో, తెలియ‌క‌నో తడి జుట్టును ముడి వేసుకుంటారు.

కానీ, ఇలా చేస్తే జుట్టు గరుకుగా మరియు పొడిగా మారిపోతుంది.కొంద‌రు త‌డి జుట్టును త్వ‌ర‌గా ఆర‌బెట్టుకోవ‌డం కోసం టవల్ తో తెగ రుద్దేస్తుంటారు.

ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు తీవ్రంగా దెబ్బ తింటారు.ఫ‌లితంగా జుట్టు మ‌ధ్య‌లోకి తెగిపోవ‌డమే కాదు ఎక్కువ‌గా రాలి పోతుంది కూడా.

Telugu Care, Care Tips, Latest, Long, Wet-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

తడి జుట్టుపై హెయిర్ డ్రైయర్స్, హెయిర్ కర్లర్స్, హెయిర్ స్ప్రే, హెయిర్ స్ట్రెయిట్నర్స్ వంటి వాటిని ఉప‌యోగిస్తుంటారు కొంద‌రు.అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తిన‌డంమే కాకుండా కేశాలు పొడిగా, ర‌ఫ్‌గా మారి పోతాయి.మ‌రియు జుట్టు చివ‌ర్లు చిట్లి పోయే ప్ర‌మాదం సైతం ఎక్కువే అందుకే త‌డి జుట్టుపై వాటిని పొర పాటున కూడా ఉప‌యోగించ‌రాదు.ఇక కొంద‌రు త‌డి జుట్టును దువ్వుతుంటారు.

ఇలా చేస్తే జుట్టు రాలే స‌మ‌స్య మ‌రింత పెరుగుతుంది.కాబ‌ట్టి, త‌డి జుట్టును ఎప్పుడూ దువ్వరాదు.

#Care Tips #Wet #Care

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube