కరోనా నేపధ్యంలో నగరంలో పడకలు ఖాళీ లేని ఆస్పత్రుల వివరాలు ఇవే.. !

ప్రాణం అంటే ఎవరికి చేదు చెప్పండి.చావాలనుకునే వారికంటే బ్రతకాలని ఆశించే వారే ఎక్కువగా ఉంటారు.

 No Vacancy In Hyderabad Hospitals For Covid Patients, Hyderabad, Secundrebad, Al-TeluguStop.com

కానీ కరోనా వచ్చి అందర్ని అయోమయంలో పడవేసింది.అయినా గానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజలు ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం అవుతున్న విషయాన్ని ఇంకా గుర్తించడం లేదు.

ఇకపోతే నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్నీ హస్పటల్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి.ఈ క్రమంలో బెడ్లు కూడా దొరకని పరిస్దితులు ఏర్పడుతున్నాయి.

అయితే ఇప్పటి వరకు బెడ్లు ఖాళీ లేని హస్పిటల్స్ వివరాలు ఒక్క సారి పరిశీలిస్తే.బొగ్గులకుంట ఆదిత్య, హైదర్‌గూడ అపోలో, అవేర్‌ గ్లోబల్, బసవతారకం, బ్రిస్టల్‌కాన్‌ ఆస్పత్రులు (హయత్‌నగర్, బర్కత్‌పురా), ముషీరాబాద్‌ కేర్, ఖైరతాబాద్‌ గ్లోబల్, సికింద్రాబాద్‌ సన్‌షైన్, యశోదా, కాచిగూడ టెక్స్‌ ఆస్పటల్, అమీర్‌పేట్‌ వెల్‌నెస్‌ సెంటర్, ఉప్పల్‌ ఆదిత్య, అల్వాల్‌ ఎక్స్‌ఎల్‌, కేపీహెచ్‌బీలోని కేకేరెడ్డి, కూకట్‌పల్లి మన ఆస్పత్రి.

న్యూబోయిన్‌పల్లి రాఘవేంద్ర, కేపీహెచ్‌బీ కాలనీలోని శానిక్య, ఉప్పల్‌ స్కిమ్స్‌, పీర్జాదిగూడ స్పార్క్‌, మదీనాగూడ అర్చన, వనస్థలిపురం ఏవీవైఏ ఆస్పత్రి, కొత్తపేట ఓమ్నీ, చందానగర్‌ పీఆర్‌కే, గచ్చిబౌలి సన్‌షైన్‌ ఆస్పత్రి, చందానగర్‌ మెడికవర్, బాగ్‌ అంబర్‌పేటలోని సీజన్స్‌ ఆస్పత్రుల్లోని పడకలు పూర్తిగా నిండిపోయాయని సమాచారం.

ఇదిలా ఉండగా కొత్తగా ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వస్తే మాత్రం ఎమర్జెన్సీలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఒకవేళ వార్డులో పడకలు ఖాళీ అయితే అక్కడికి షిఫ్ట్‌ చేస్తున్నారు.ఇకపోతే దాదాపుగా ప్రతి హస్పటల్లో నగదు చెల్లించే రోగులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వార్త ప్రచారంలో ఉంది.

ఇదండి నగరంలో కరోనా దుస్దితి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube