మునగ సాగుకు మేలు రకం విత్తనాలు ఇవే..!

వ్యవసాయంలో అధిక దిగుబడి( High Yielding ) సాధించాలంటే మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకొని సాగు చేయాలి.మేలు రకం విత్తనాలు అంటే వివిధ రకాల తెగుళ్లను తట్టుకొని నిలబడేవి.

 These Are  The High Yielding Varieties In Drumstick Details, Drumstick , Drumsti-TeluguStop.com

కాబట్టి ఏ పంట వేసినా ముందుగా ఆరోగ్యకరమైన విత్తనాలను ( Seeds ) మాత్రమే ఎంపిక చేసుకొని పొలంలో నాటుకోవాలి.మునగ పంటలు( Drumstick Crop ) అధిక దిగుబడి సాధించడం కోసం మేలు విత్తనాలు ఏమిటో చూద్దాం.

పీకెఎం-1:

ఈ విత్తనాలను తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించింది.ఈ రకం విత్తనాలకు చెందిన మొక్కలు దాదాపుగా ఏడు మీటర్ల ఎత్తు పెరుగుతాయి.

నాటిన 90 రోజులకు పూత వచ్చి, నాటిన 160 రోజులకు పంట చేతికి వస్తుంది.ఇక ఒక మొక్కకు సుమారుగా 200 పైనే కాయలు కాస్తాయి.ఒక హెక్టార్ లో దాదాపుగా 50 టన్నుల దిగుబడి పొందవచ్చు.

పీకెఎం-2:

ఈ రకనికి చెందిన మొక్కలు 100 రోజులకు పూతకు వచ్చి, నాటిన 150 రోజులకు పంట చేతికి వస్తుంది.ఇక ఒక మొక్కకు సుమారుగా 200 పైనే కాయలు కాస్తాయి.ఒక హెక్టారులో దాదాపుగా 90 టన్నుల పైన దిగుబడి పొందవచ్చు.

జాఫ్నా:

ఈ రకానికి చెందిన కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.ఎందుకంటే ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి.పంట వేసిన మొదటి సంవత్సరం మొక్కకు దాదాపుగా 100 కాయలు కాస్తాయి.కానీ నాలుగు సంవత్సరాల అనంతరం చెట్టుకు దాదాపుగా 500 పైనే కాయలు కాస్తాయి.కాయ పొడవు కూడా 60 సెంటీమీటర్ల పైనే ఉంటుంది.

ధన రాజ్:

ఇవి పొట్టి రకానికి చెందినవి.వీటి కాయలు సుమారుగా 40 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.సంవత్సర కాలంలో ఒక మొక్క నుండి దాదాపుగా 300 కాయల పంట దిగుబడి వస్తుంది.అయితే పంట నాటిన తొమ్మిది నెలల తర్వాత పంట చేతికి వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube