ప్రెగ్నెన్సీ టైమ్‌లో అస్స‌లు తిన‌కూడ‌ని పండ్లు ఇవే!

ప్ర‌కృతి ప్ర‌సాదించిన గొప్ప వ‌రాల్లో పండ్లు ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.పిల్లలు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ పండ్ల‌ను డైట్‌లో చేర్చుకోవ‌చ్చు.

 These Are The Fruits That Should Not Be Eaten At All During Pregnancy! Fruits, F-TeluguStop.com

మాన‌వ శ‌రీరానికి కావాల్సిన అన్ని పోష‌కాలు పండ్ల‌లో దొరుకుతాయి.అటువంటి పండ్లు ఆరోగ్య ప‌రంగానూ మ‌రియు సౌంద‌ర్య ప‌రంగానూ ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

ఇక ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లకు పండ్లు ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.కానీ, ఆరోగ్యానికి ఎంత మంచి చేసినా.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో కొన్ని కొన్ని పండ్లన అస్స‌లు తీసుకోరాదు.

ఆ జాబితాలో పైనాపిల్ పండు ఒక‌టి.

పైనాపిల్‌లో బ్రొమెలైన్‌ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది.అందువ‌ల్ల‌, గ‌ర్భిణీ స్త్రీలు పైనాపిల్ తీసుకుంటే గర్భం విఛ్చినం కావటమో లేదా నెలలు నిండక ముందే డెలివ‌రీ అవ్వ‌డ‌యో జ‌రుగుతుంది.

అలాగే న‌ల్ల ద్రాక్ష పండ్ల‌ను కూడా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఖ‌చ్చితంగా ఎవైడ్ చేయాలి.ఎందుకంటే, గ‌ర్భ‌వుతులు న‌ల్ల ద్రాక్ష తీసుకుంటే.

జీర్ణ స‌మ‌స్య‌లు అత్య‌ధికంగా ఉంటాయి.

Telugu Fruits, Fruits Pregnant, Tips, Latest, Pregnancy, Pregnant-Telugu Health

లిచీ పండు రుచి అద్భుతంగా ఉంటుంది.పోష‌కాలు కూడా మెండుగానే.కానీ, ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో లిచీ పండు తిన‌క‌పోవ‌డమే చాలా మంచిదంటున్నారు నిపుణులు.

లిచీ పండు తీసుకుంటే రక్తస్రావం, కడుపు నొప్పి, పిండం క్షీణ‌త వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి.స్టార్ యాపిల్‌ను కూడా గ‌ర్భిణీ స్త్రీలు తిన‌కూడ‌దు.ఎందుకంటే, ఇవి శరీర వేడికి కారణం అవుతాయి.

బొప్పాయి పండు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో తిన‌కూడ‌ద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఎందుకంటే, గ‌ర్భాన్ని విఛ్చినం చేసే గుణాలు బొప్పాయి పండులో ఎక్కువ‌గా ఉంటాయి.అందుకే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో బొప్పాయి పండుని ఎవైడ్ చేయాల‌ని ఆరోగ్య నిపుణులు, పెద్ద‌లు చెబుతుంటారు.

ఇక వీటితో పాటుగా పీచ్ ప‌ళ్లు, లోంగన్ ప‌ళ్లు, రేగి ప‌ళ్లు కూడా ప్రెగ్నెన్సీ స్త్రీల‌కు అంత మంచిది కాదు.కాబ‌ట్టి, వీటి విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube