తెలుగు సినిమా పరిశ్రమ మూకీ నుంచి టాకీగా మారడం అప్పట్లో సంచలనం అని చెప్పుకోవచ్చు.ముందు తెరమీద బొమ్మలు మాత్రమే కనిపించేవి.
ఆ తర్వాత మాటలు.నెమ్మదిగా పాటలూ వచ్చాయి.
అయితే అప్పట్లో నేపథ్య గాయకులు అంటూ ప్రత్యేకంగా ఉండేవారు కాదు.ఎవరి పాటను, పద్యాన్ని వాళ్లే పాడుకునే వాళ్లు.
అందకే అప్పట్లో రంగస్థలం మీద ప్రతిభ కనబర్చిన వారే సినిమాల్లోనూ సత్తా చాటారు.అంతేకాదు.
తొలినాళ్లలో ఎక్కువగా జనపద సినిమాలు, పౌరాణిక సినిమాలు మాత్రమే తెరకెక్కాయి.అయితే తెలుగులో తెరకెక్కిన తొలి సినిమా భక్త ప్రహ్లాద సినిమా విషయంలో తొలి గాయకుడు, గాయని ఎవరు అనే విషయాల్లో సందిగ్ధత అనేది ఉంది.
అటు భక్త ప్రహ్లాద సినిమా విడుదల విషయంలోనూ కాస్త గందరగోళం నడిచింది.ఈ సినిమా 1931 సెప్టెంబర్ 15వ విడుదలైందని అంతా అనుకున్నారు.కానీ తాజాగా తేలిన విషయం ఏంటంటే ఈ సినిమా 1932 ఫిబ్రవరి 6వ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు హెచ్.
ఎమ్.రెడ్డి దర్శకత్వం వహించాడు.ప్రహ్లాదుడిగా సుధీర్ నటించాడు.హిరణ్య కశపుడి పాత్రలో సుబ్బయ్య నటించాడు.అటు తొలి గాయకుడు ఎమ్మెస్ రామారావు కాదు.మాస్టర్ సాబు అనే విషయం కూడా వెల్లడి అయ్యింది.
ఇకత తొలి గాయని అని ఇన్నాళ్లు అనుకుంటున్న బాల సరస్వతి కాదు.బెజవాడ రాజారత్నం అని తేలింది.
1944లో వచ్చిన తహశీల్దార్ చిత్రం కోసం పద్మనాభశాస్త్రి సంగీత దర్శకత్వంలో ఎమ్మెస్ రామారావు ఒక పాట పాడాడు.ప్రేమలీలా మోహన అనే ఈ పాట చక్కగా ముందుకుసాగుతుంది.కానీ అంతకు ముందే 1939 ఏప్రిల్ 1న వందేమాతరం సినిమా కోసం పూలో .పూలో అనే పాటను పాడాడు మాస్టర్ సాబు.అందుకే తొలి గాయకుడిగా సాబు గుర్తింపు దక్కించుకున్నాడు.ఇక తొలి గాయనిగా బాలసరస్వతీ దేవి అనుకునే వారు.1940లో వచ్చిన ఇల్లాలు సినిమాలో ఆమె తన పాత్రకు తానే పాడుకుంది.అందుకే అది నేపథ్య గీతం కాదని తేల్చారు.1943లో కేవీ రెడ్డి తెరకెక్కించిన భక్త పోతన సినిమాలో పాటను బెజవాడ రాజారత్నం పాడింది.అందుకే తను తొలి నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకుంది.