హిందువులకు పవిత్రమైన నగరమైన అయోధ్యలో రామ మందిరం( Ayodhya Ram Mandir ) జనవరి 22న ప్రారంభం కానుంది.ఆ రోజు నుంచి రామ మందిరాన్ని సందర్శించేందుకు భారతదేశ నాలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది.
అయితే అయోధ్యలో బాల రాముడి సందర్శన చేసుకోవడమే ఇక్కడి స్ట్రీట్ ఫుడ్( Street Food ) రుచి చూసి పర్యాటకులు మైమరిచిపోవచ్చు.ముఖ్యంగా కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఒకసారి వాటిని రుచి చూస్తే మిమ్మల్ని మీరే మైమరిచిపోవడం ఖాయం.
అవేవో తెలుసుకుందాం.
* చాట్
చాట్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో దొరుకుతుంది కానీ, అయోధ్యలోని చాట్( Chaat ) రుచి మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది.ఈ నగరంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు చాట్‌ను తయారు చేయడానికి వివిధ రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు.చాట్‌లో తీపి, పుల్లని చట్నీ, మసాలా చిక్పీస్, సుగంధ కొత్తిమీర, ఇతర మసాలా దినుసులను కలపడం ద్వారా ఈ ఐటమ్ టేస్ట్ ను పెంచుతారు.
అయోధ్యలోని చాట్‌ను సాయంత్రం వేళల్లో ఎక్కువగా తినడం జరుగుతుంది.
* దాల్ కచోరి
ఉత్తరప్రదేశ్‌లో ఒక పాపులర్ డిష్‌గా దాల్ కచోరి( Dal Kachori ) నిలుస్తోంది.పూరీ, కచోరీలతో ఈ ఐటమ్ నోరూరిస్తుంది.కచోరీలను మూంగ్, మినప పప్పులతో తయారు చేస్తారు.
ఈ ఐటమ్‌ను చట్నీ లేదా వెజిటేబుల్స్‌తో వేడివేడిగా సర్వ్ చేస్తారు.అయోధ్యలోని దాల్ కచోరి టేస్టీ చాలా అద్భుతంగా ఉంటుంది.
* దహీ భల్లా
దహీ భల్లా( Dahi Bhalla ) అయోధ్య స్ట్రీట్ ఫుడ్స్‌లో బాగా పాపులర్ అయిన ఒక వంటకం.ఇది పప్పులతో చేసిన వడలు, పెరుగు, తీపి-పుల్లని చట్నీల కలయికతో తయారవుతుంది.చేయబడుతుంది.దహీ భల్లా అయోధ్యలోని ప్రతి వీధిలోనూ దొరుకుతుంది.
* రబ్డి
రబ్డి( Rabdi ) అయోధ్యలో దొరికే ఒక పాపులర్ స్వీట్ ఐటమ్.పాలు, చక్కెర, పంచదారతో దీనిని తయారు చేస్తారు.రబ్డిని కుంకుమపువ్వు, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌తో వడ్డిస్తుంటారు.రబ్డి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.
అయోధ్య స్ట్రీట్ ఫుడ్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది.అతి తక్కువ డబ్బుతో ఈ అద్భుతమైన ఐటమ్స్ తినవచ్చు.