నాగ దోషాలు తొలగిపోవాలంటే ఈ దేవాలయాలను దర్శించాల్సిందే..?

మన హిందువులు సంస్కృతి సాంప్రదాయాలతో పాటు జాతకాలను కూడా ఎక్కువగా విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే చాలామంది వారికి పిల్లలు పుట్టగానే వారి పుట్టిన తేదీ సమయాన్ని జ్యోతిష్యులకు చూపిస్తూ వారి జాతకాలను రాయిస్తారు.

 These Are The Famous Nagadosha Pariharan Temples In India Nagadosham ,nagadosham-TeluguStop.com

ఇలా ఎవరి జీవితంలోనైనా జాతక దోషాలు ఉంటే వెంటనే వాటిని పరిహారం చేసుకోవాలి అని పండితులు చెబుతారు.ఈ విధమైనటువంటి జాతక దోషాలు ఉండటం వల్ల మనం చేపట్టే కార్యక్రమాలలో కూడా విజయం సాధించలేము.

చేసే పనులకు ఆటంకం ఏర్పడుతూ ఎన్నో కష్టాలు చుట్టుముడుతాయి.ఇలాంటి దోషాలలో నాగదోషం ఒకటని చెప్పవచ్చు.

చాలామంది వారి జాతక దోషాలలో నాగ దోషం ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.ముఖ్యంగా పెళ్లి కాకపోవడం, ఇతర పనులు వాయిదా పడుతూ ఉండటం వంటి సమస్యలతో సతమతమవుతారు.

ఈ విధంగా నాగదోషంతో బాధపడేవారు కొన్ని ఆలయాలను సందర్శించి నాగదోష పరిహారం చేసుకుంటారు.అయితే ఈ విధమైనటువంటి నాగ దోషాలతో బాధపడేవారు ముఖ్యంగా దర్శించాల్సిన ఆలయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

నాగ దోషాలతో బాధపడేవారు కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ఉన్నటువంటి వాసుకి, శేషనాగుకు పూజలు చేయటం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోతాయి.ఈ ఆలయంతో పాటు ఆసగనహళ్లి నాగప్ప దేవాలయం, బెంగళూరులోని ఘటి సుబ్రహ్మణ్య ఆలయం, కేరళలోని మన్నరసాల దేవాలయం, తమిళనాడులోని నాగరత్న స్వామి దేవాలయం, జమ్మూ కాశ్మీర్ లో ఉన్న శేషనాగ్ వంటి ఆలయాలను సందర్శించడం వల్ల నాగదోషాలు తొలగిపోతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube