India Electric scooters : ఇండియాలో త్వరలోనే రిలీజ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..!

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లకు డిమాండ్ పెరుగుతోంది.ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైక్స్ పరిచయం చేయడానికి శరవేగంగా అడుగులు వేస్తున్నాయి.

 These Are The Electric Scooters That Will Soon Be Released In India , New Electr-TeluguStop.com

ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్‌సైకిళ్లను రిలీజ్ చేశాయి.కాగా త్వరలోనే మరిన్ని కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ఈ-బైక్స్‌ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.మరి త్వరలో ఇండియాలో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

1.సింపుల్ వన్:

సింపుల్ వన్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోయే టెక్నాలజీ ఫీచర్లతో, పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఇండియాలో రిలీజ్ కానుంది.ఇది స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఉంటుందని సమాచారం.2023 మొదటి త్రైమాసికంలో ఈ స్కూటర్ డెలివరీలను ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది దీన్నిబట్టి త్వరలోనే ఈ స్కూటర్ ఇండియాలో అందుబాటులోకి రావచ్చు అని తెలుస్తోంది.

Telugu Electric, Electricscooter, Ola Electric-Latest News - Telugu

2.ఓలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

ఓలా ఎలక్ట్రిక్ ఇండియాలో ఓలా S1 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో అద్భుతమైన విజయాన్ని సాధించింది.ఇప్పుడు ఈ స్టార్టప్ ఈవీ తయారీదారు దేశంలో తన సొంత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది.ఈ ఓలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో పెద్ద బ్యాటరీ, అనేక ఫీచర్లు ఉంటాయని టాక్.

3.యమహా ఎలక్ట్రిక్ స్కూటర్

జపాన్ ద్విచక్ర వాహన తయారీదారు యమహా ఇప్పటికే ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టెస్ట్ చేస్తోంది.ఇది కూడా ఇండియాలోనే త్వరలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది.

4.హోండా ఎలక్ట్రిక్ స్కూటర్

హోండా టూ వీలర్స్ ఇండియా తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇప్పటివరకు చేర్చుకోలేకపోయింది.

ఈ జపనీస్ దిగ్గజం సంస్థకి చాలా అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేసిన అనుభవం ఉంది.అలానే దీని వద్ద వరల్డ్ క్లాసు టెక్నాలజీ ఉంది.అయితే, హోండా వచ్చే ఏడాదిలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.

5.హస్క్వర్నా ఎలక్ట్రిక్ స్కూటర్

ఈవీ సెగ్మెంట్‌లో కొత్త టూవీలర్స్ లాంచ్ చేయాలని బజాజ్ కొంతకాలంగా ప్లాన్ చేస్తోంది.ఈ కంపెనీ కొత్త స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయడానికి బజాజ్ KTM / Husqvarnaతో చేతులు కలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube