మోచేతుల నలుపును వారం రోజుల్లో పోగొట్టే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ఇవే!

మనలో చాలా మందికి శరీరం మొత్తం ఒక రంగులో ఉంటే మోచేతులు మాత్రం నల్లగా మరొక రంగులో ఉంటాయి.

కొందరు మోచేతుల‌ నలుపు గురించి పెద్దగా పట్టించుకోరు.

కానీ కొందరు మాత్రం మోచేతులు నల్లగా ఉండడాన్ని అస్సలు సహించలేరు.ఈ క్రమంలోనే ఆ నలుపును వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే మోస్ట్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ను ప్రయత్నిస్తే మోచేతుల నలుపును వారం రోజుల్లో పోగొట్టుకోవచ్చు.

రెమెడీ 1: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్(Coffee Powder), వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్(milk powder), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ (lemon Juice)మరియు మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పొటాటో జ్యూస్(potato Juice) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో మోచేతులను స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక ప్రయత్నిస్తే నలుపు క్రమంగా వదిలిపోతుంది.

మోచేతులు తెల్లగా, మృదువుగా మారతాయి.

రెమెడీ 2: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి(besan flour), వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి(sandalwood powder), హాఫ్ టీ స్పూన్ పసుపు(turmeric powder), వన్ టేబుల్ స్పూన్ పెరుగు(curd), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు సరిపడా పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మోచేతులకు కాస్త మందంగా అప్లై చేసి ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.

రెగ్యులర్ గా ఈ హోమ్ రెమెడీని పాటించిన కూడా మంచి రిజల్ట్ పొందుతారు.ఈ రెమెడీ మోచేతుల నలుపును వదిలిస్తుంది.అక్కడి చర్మాన్ని వైట్ గా, బ్రైట్ గా మారుస్తుంది.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు