బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఏంటో మీకు తెలుసా?  

brain stroke symptoms, health care, Paralysis, - Telugu Brain Stroke Symptoms, Health Care, Paralysis

మన శరీర పనితీరు మెరుగ్గా పనిచేయాలంటే మెదడు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించాలి.మరి అలాంటి మెదడుకు జరిగే రక్త ప్రసరణలో ఏదైనా ఆటంకం కలగడం వల్ల వచ్చే ప్రమాదమే ఈ బ్రెయిన్ స్ట్రోక్.

TeluguStop.com - These Are The Brain Stroke Symptoms In Telugu

బ్రెయిన్ స్ట్రోక్ అనేది రక్తస్రావం వల్ల కూడా కలగవచ్చు.అయితే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి? బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల ఎలాంటి లక్షణాలు కలుగుతాయి? ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం.

బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు ఉన్నటువంటి వారిలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడే వ్యక్తి ముఖం ఒకవైపు వేలాడినట్టు లేదా మొద్దుబారినట్లు అనిపిస్తుంది.

TeluguStop.com - బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఏంటో మీకు తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

అలాంటి వ్యక్తులను నవ్వు అని చెప్పిన సరే వారు నవ్వడానికి ఇబ్బంది పడతారు.ఇలాంటి వ్యక్తులు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎటువంటి కారణం లేకుండా కొందరు తీవ్రమైన తల నొప్పితో బాధపడుతూ ఉంటారు.అలాంటివారికి మెదడులో రక్తస్రావంతో కూడిన స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

బ్రెయిన్ స్ట్రోక్ బారినపడే వ్యక్తులకు జ్ఞాపక శక్తి క్రమంగా తగ్గిపోతుంది.కళ్ళు బైర్లు కమ్మడం, చూపు మందగించడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ కు కారణాలే.

అంతేకాకుండా ఇలాంటి వ్యక్తులు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు.

చిన్న చిన్న ప్రశ్నలు అడిగిన సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఇలాంటి పరిస్థితి కలగకుండా ఉండాలంటే తీసుకొనే ఆహారంలో తగు జాగ్రత్తలు పాటించాలి.వీలైనంతవరకు తగినంత బరువును కలిగి ఉండాలి.

అధిక రక్తపోటు ఉన్న వారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఇలాంటి పరిస్థితి నుండి దూరం కావచ్చు.

#Health Care #Paralysis #BrainStroke

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

These Are The Brain Stroke Symptoms In Telugu Related Telugu News,Photos/Pics,Images..