కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్న హీరో నాని.. వరుస ఫ్లాపులంటూ?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమా అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిని చూపిస్తారనే సంగతి తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో మాత్రం నాని టైమ్ అస్సలు బాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 These Are The Biggest Mistakes In Hero Nani Cine Career Details Goes Viral , Big-TeluguStop.com

నాని నటించిన సినిమాలు వరుసగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి.నాని సినిమాల ఫలితాలు చూసి నాని ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు.

కథల విషయంలో నాని పొరపాట్లు చేస్తున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వీ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.అయితే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

ఆ తర్వాత నాని హీరోగా తెరకెక్కిన టక్ జగదీష్ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు కూడా ఫ్లాప్ టాక్ వచ్చినా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదని రొటీన్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నాని తప్పు చేశాడని కామెంట్లు వ్యక్తమయ్యాయి.శ్యామ్ సింగరాయ్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఈ సినిమా కమర్షియల్ గా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.

ప్రస్తుతం అంటే సుందరానికి సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

Telugu Amazon Prime, Biggest, Nani, Ott, Shyam Singaray, Shyam Singaroy-Movie

ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లను సాధించిన అంటే సుందరానికి సినిమాకు వీకెండ్ తర్వాత ఊహించని స్థాయిలో కలెక్షన్లు తగ్గాయి.వరుస ఫ్లాపులతో నాని కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నాని తర్వాత ప్రాజెక్ట్ లతో అయినా భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube