మొబైల్ యూజర్ల కోసం బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్స్ ఇవే..!

ఈ రోజుల్లో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అందుబాటులోకి వచ్చాక చాలామంది తన వీడియోలతో పాటు రకరకాల వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్నారు.ఇందుకోసం బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్స్ వెతుకుతున్నారు.

 These Are The Best Video Editing Apps For Mobile Users. ,video Editing Apps, And-TeluguStop.com

అలాంటి వారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3 బెస్ట్ ఆండ్రాయిడ్ వీడియో ఎడిటింగ్ యాప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

వీఎన్ వీడియో ఎడిటర్:

Telugu Android Apps, Apps, Tech-Latest News - Telugu

వీఎన్ వీడియో ఎడిటర్ అనే ఆండ్రాయిడ్ యాప్‌ను ఫ్రీగా వాడుకోవచ్చు.ఈ యాప్ మల్టీ-ట్రాక్ టైమ్‌లైన్‌తో వస్తుంది.దాని ద్వారా మీరు మీకు కావలసినన్ని లేయర్లను యాడ్ చేసుకోవచ్చు.

అలానే ఆల్రెడీ క్రియేట్ చేసిన టెంప్లేట్‌లు, స్పీడ్ అడ్జస్ట్‌మెంట్, స్ప్లిట్టింగ్ , ట్రిమ్మింగ్, ఎఫెక్ట్స్ వంటి చాలా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.అలానే ఎడిటెడ్ వీడియోలను వాటర్ మార్క్ లేకుండా మీరు పొందవచ్చు.

అంతేకాదు, హై క్వాలిటీ వీడియోలను ఫ్రీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు.ఈ యాప్ డేటా సైజ్ దాదాపు 139ఎంబీ ఉంటుంది.

కైన్‌మాస్టర్:

Telugu Android Apps, Apps, Tech-Latest News - Telugu

కైన్‌మాస్టర్ అనేది ఆండ్రాయిడ్‌లో బెస్ట్ ఫుల్లీ-ఫీచర్డ్‌ వీడియో ఎడిటర్‌ యాప్ అని చెప్పవచ్చు.ఈ యాప్ మల్టీ-లేయర్‌ల వీడియో, ఇమేజ్‌లు, టెక్స్ట్‌లకు సపోర్ట్ చేస్తుంది.అలాగే మల్టీ-లేయర్ టైమ్‌లైన్ అడ్జస్ట్‌మెంట్, మల్టీ-ట్రాక్ ఆడియోకు సపోర్టు ఇస్తుంది.ఎలాంటి అవాంతరాలు లేకుండా వాయిస్‌ఓవర్లు, ప్లే బ్యాక్ మ్యూజిక్‌ను సులభంగా యాడ్ చేయడానికి యూజర్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఇక వీడియో ఎడిటింగ్ టూల్స్ విషయానికి వస్తే, ట్రిమ్, కట్, ఆడియో కంట్రోల్స్, కలర్ LUT ఫిల్టర్‌లు, 3D ట్రాన్సిషన్‌లు, మరిన్నింటితో సహా మీకు అవసరమైన అన్ని టూల్స్‌ను ఈ యాప్ అందిస్తుంది.పర్సనల్, నాన్ కమర్షియల్ వినియోగానికి ఈ యాప్ పూర్తిగా ఉచితం.

అయితే ఫ్రీ వెర్షన్ నుంచి ఎక్స్‌పోర్ట్ చేసే వీడియోలకు వాటర్‌మార్క్ ఉంటుంది.నెలకు కొంత అమౌంట్ కడితే వాటర్‌మార్క్ లేకుండా వీడియోలను ఎక్స్‌పోర్ట్ చేయడం కుదురుతుంది.

ఇన్‌షాట్

ఇన్‌షాట్ వీడియో ఎడిటింగ్ యాప్ సాయంతో చాలా సింపుల్‌గా వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు.ఇన్‌షాట్ ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను షూట్ చేసి, ఎడిట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది.

దీనిలో ట్రిమ్, స్ప్లిట్, కట్, జూమ్, వీడియో రివర్స్ వంటి చాలా ఫీచర్స్ ఉంటాయి.అంతేకాకుండా, మీరు వీడియో స్పీడును సవరించవచ్చు.స్టాండర్డ్ వీడియోలను స్లో-మో వీడియోలు లేదా టైమ్-లాప్స్‌గా మార్చవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube