అమావాస్యలోపు ఈ పని చేయడం మర్చిపోకండి ఇలా చేస్తే అన్ని శుభాలే..!

సాధారణంగా హిందువులు ప్రతినెలా వచ్చే అమావాస్య పౌర్ణమిలను ఎంతో ప్రత్యేకమైన రోజులుగా భావించి ఆ రెండు రోజులు ఎంతో భక్తి భావంతో పూజలు నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు.

 These Are The Rituals To Do For Pitrudevatas Before New Moon Details, Amavasya, Pitru Devatas, New Moon, Pitru Tarpanam, Mahalaya Amavasya, Pooja For Died Ancestors, Amavasya Bath, Donating Food, Hindu Tradition-TeluguStop.com

ఈ పదిహేను రోజులను మహాలయ పక్షాలు అని పిలుస్తారు.ఈ మహాలయ పక్షాన్ని సంతాప దినాలుగా కూడా భావిస్తారు.

సంతాప దినాలుగా ఉండి ఈ పదిహేను రోజులలో మన ఇంట్లో చనిపోయిన పూర్వీకులకు పితృదేవతలను సంతృప్తి పరచాలని పండితులు చెబుతున్నారు.

 These Are The Rituals To Do For Pitrudevatas Before New Moon Details, Amavasya, Pitru Devatas, New Moon, Pitru Tarpanam, Mahalaya Amavasya, Pooja For Died Ancestors, Amavasya Bath, Donating Food, Hindu Tradition-అమావాస్యలోపు ఈ పని చేయడం మర్చిపోకండి ఇలా చేస్తే అన్ని శుభాలే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చే అమావాస్యలోపు చనిపోయిన మన పూర్వీకులకు పిండప్రదానం చేయడం వల్ల మన పై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోయి అనుకున్న పనులు ముందుకు సాగుతాయి.

వివాహం కాని వారికి వివాహ గడియలు రావడం ఉద్యోగాలలో ప్రమోషన్లు వ్యాపారాభివృద్ధి, సంతానం కలగడం వంటి శుభకార్యాలు జరుగుతాయి.అందుకే చనిపోయిన పూర్వీకులను ఈ పదిహేను రోజులలో ఏదో ఒకరోజు తలచుకొని వారికి పిండప్రదానం చేసి వారి పేరిట దానం చేయాలి.

ఇప్పటివరకు ఎవరైతే చేసి ఉండరో అలాంటి వారు అమావాస్యలోపుపని చేయటం వల్ల వారిపై పిత్రు శాపాలు ఉండవని పండితులు చెబుతున్నారు.

ఇక కేవలం మహాలయ అమావాస్య రోజు మాత్రమే కాకుండా ప్రతి అమావాస్య రోజు ఉదయం బియ్యం కూరగాయలను బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.సాక్షాత్తు బ్రాహ్మణుణ్ణి ఈశ్వర స్వరూపంగా భావించి అతనికి దానం చేయటం వల్ల శుభఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.అదేవిధంగా నదీ తీరానికి లేదా నీళ్ళు పారుతున్నటువంటి ప్రదేశానికి వెళ్లి అమావాస్య రోజు స్నానం చేసి మూడుసార్లు చేతులతో నీటిని తీసుకుని తర్పణం వదలటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని పండితులు తెలియజేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube