అమెరికాలో మీరు చదవాలనుకుంటున్నారా? అయితే, ఈ నగరాలు ది బెస్ట్!

అమెరికాలో( America ) చదవాలని ఎవరికుండదు? ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విశ్వవిద్యాలయాలు అక్కడే వున్నాయి కాబట్టి కాస్త కాసులు ఎక్కువ వున్నవారు అక్కడికి వెళ్లి చదువుకొని అక్కడే స్థిరపడాలని కలలు కంటూ వుంటారు.ముఖ్యంగా మన భారతీయ విద్యార్థులు…( Indian Students ) అత్యుత్తమ విద్యా కార్యక్రమాలు, కెరీర్‌ అవకాశాల కారణంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికాను ఎంచుకుంటున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి.

 These Are The Best Places To Study In America Details, America, Study In America-TeluguStop.com

యూఎస్‌లో జీవన వ్యయం, ట్యూషన్‌ ఫీజులు చాలా ఖరీదు.అయినప్పటికీ అంతర్జాతీయ విద్యార్థులకు నాణ్యమైన విద్య, అనుకూలమైన వాతావరణాన్ని అందించే నాలుగు నగరాలు ప్రధానంగా ఉన్నాయి.

Telugu America, Austin, Duke, Indian, Corolina, Texas, Tucson-Telugu NRI

అందులో మొదటిది “టక్సన్, అరిజోనా.” దక్షిణ అరిజోనాలో ఉన్న టక్సన్‌ నగరం( Tucson ) భారతీయ విద్యార్థులకు సరసమైన ధరలకే సకల సౌకర్యాలను అందిస్తుంది.ఒక పడకగది అపార్ట్‌మెంట్‌ అద్దె నెలకు అక్కడ 937 అమెరికన్‌ డాలర్లు ఉంటుంది.ఇక అక్కడ నెలవారీ కిరాణా సామాగ్రి సగటు ధర 278 డాలర్లు అవుతుందని సమాచారం.

ఇక టక్సన్‌ యూనివర్సిటీ విభిన్న విద్యార్థి సంఘాన్ని కలిగి ఉంటుంది.ఆ తరువాత చెప్పుకోతగ్గది “ఆస్టిన్, టెక్సాస్‌.” ఆస్టిన్‌( Austin ) రుచికరమైన ఆహారం మరియు వెచ్చని వాతావరణానికి ప్రసిద్ధి గాంచింది.ఆస్టిన్‌లోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయంతో సహా దేశంలోని కొన్ని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకు కూడా ఈ నగరం నిలయంగా ఉంది.

Telugu America, Austin, Duke, Indian, Corolina, Texas, Tucson-Telugu NRI

తరువాత ఇక్కడ “రాలీ, నార్త్‌ కరోలినా” గురించి మాట్లాడుకోవాలి.ఈ నగరం నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ, డ్యూక్‌ యూనివర్సిటీ వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు నిలయం.రాలీలో ఒక పడకగది అపార్ట్‌మెంట్‌ కోసం సగటు నెలవారీ అద్దె 1,000 అమెరికన్‌ డాలర్లు మాత్రమే.అమెరికాలో అత్యంత సరసమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది.ఇక చివరగా “పిట్స్‌బర్గ్, పెన్సిల్వేనియా” గురించి మాట్లాడుకోవాలి.ఇక్కడ కార్నెగీ మెల్లన్‌ విశ్వవిద్యాలయం, పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం మంచి పేరుగాంచినవి.

పిట్స్‌బర్గ్‌లో సింగిల్‌ బెడ్‌రూం ప్లాట్‌ అద్దె 900 అమెరికన్‌ డాలర్లు మాత్రమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube