ధోని క్రికెట్ కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇవే..

క్రికెట్ కెరీర్‌లో తొలినాళ్లలో మహేంద్ర సింగ్ ధోనికి లోయర్ ఆర్డర్‌లో మాత్రమే ఆడాడు.చివర్లో కూడా లోయర్ ఆర్డర్‌కే పరిమితం అయ్యాడు.

 These Are The Best Innings Of Dhoni's Cricket Career , Ms Dhoni, Best Innings, S-TeluguStop.com

ఇలా బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనుక రావడం వల్ల ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు.అయితే ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్‌గా పేరు సంపాదించాడు.

ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు.ఓటమి అంచుల నుంచి బయటపడేశాడు.

ఓడిపోవాల్సిన మ్యాచుల్లో విజయం దక్కేలా చేశాడు.అందుకే ఇప్పటికీ బెస్ట్ ఫినిషర్ ఎవరంటే టక్కున ధోని పేరే గుర్తుకు వస్తుంది.

భారీగా పరుగులు చేయకపోయినా కొన్ని కీలక ఇన్నింగ్స్‌ను ధోని ఆడాడు.వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ధోని వన్డే కెరీర్ ప్రారంభించిన సమయంలో తొలి నాలుగు మ్యాచుల్లో వరుసగా 0, 12, 7, 3 పరుగులు మాత్రమే చేశాడు.అతడిలో ఎంతో టాలెంట్ ఉన్నా, బ్యాటింగ్ ఆర్డర్‌లో చివర్లో రావడం వల్ల ఆ టాలెంట్ బయటకు రావడం లేదని అప్పటి భారత కెప్టెన్ గంగూలీ గ్రహించాడు.

చివరికి విశాఖలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపాడు.తాను ఆడే వన్ డౌన్ స్థానంలో ధోనిని గంగూలీ పంపించడం సత్ఫలితాన్ని ఇచ్చింది.ఇక పాక్ బౌలర్లపై ధోని విరుచుకు పడ్డాడు.123 బంతుల్లోనే 158 పరుగులు చేశాడు.ఆ తర్వాత 2005లో శ్రీలంకతో జైపూర్‌లో జరిగిన వన్డేలో ధోని విశ్వరూపం చూపించాడు.బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలినా తాను ఏకంగా 183 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు.

ఇప్పటికీ ప్రపంచ వికెట్ కీపర్లు చేసిన అత్యధిక స్కోరు అదే.

Telugu Finisher, Ganguly, Cricket Career, Mahendrasingh, Dhoni, Msdhoni, Teams-L

ఇక 2013లో శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్‌లో 208 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 167కే టీమిండియా 8 వికెట్లు కోల్పోయింది.కాసేపటికే 9వ వికెట్ కూడా భారత్ కోల్పోయింది.ఇక చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమైన స్థితిలో ధోని అద్భుత ఆటతీరుతో ఒక ఫోర్, రెండు సిక్స్‌లు కొట్టి భారత్‌ను గెలిపించాడు.2007లో లార్డ్స్‌ మైదానంలో జరిగిన టెస్టులో కూడా ధోని చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు.9 వికెట్లు పడిపోయినా ఆఖరి బ్యాట్స్‌మెన్ శ్రీశాంత్‌తో కలిసి టెస్టు డ్రా అయ్యేలా చేశాడు.ఆ సమయంలో ధోని చేసింది 76 పరుగులే అయినా ఆ టెస్టు డ్రాతో మొత్తం టెస్టు సిరీస్‌ను 1-0తో భారత్ గెలుచుకుంది.ఇక మరుపురాని ఇన్నింగ్స్‌లో అత్యంత చెప్పుకోదగ్గది 2011లో శ్రీలంకతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్.

అందులో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చిన ధోని ఏకంగా 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.అద్భుతమైన విన్నింగ్ షాట్ కొట్టి భారత్‌కు రెండవ వన్డే ప్రపంచ కప్ సాధించి పెట్టాడు.

ఈ ఐదు ఇన్నింగ్స్ ధోని కెరీర్‌లో అత్యంత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌గా భావించొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube