ఆడవారి మాదిరిగానే మగవారికీ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవాలనే కోరిక ఉంటుంది.కానీ, సరైన అవగాహన లేకపోవడం వల్ల చర్మం విషయంలో అశ్రద్ధగా వ్యవహరిస్తుంటారు.
ఫలితంగా మొటిమలు, మచ్చలు, పొడి చర్మం, జిడ్డు చర్మం, పిగ్నెంటేషన్, డార్క్ సర్కిల్స్ ఇలా ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.వీటి నుంచి చర్మాన్ని రక్షించుకుని అందంగా, యవ్వనంగా కనిపించాలీ అని కోరుకునే మగవారు.
ఇప్పుడు చెప్పబోయే ఫేస్ ప్యాకులను ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే.మరి ఆలస్యమెందుకు ఆ ఫేస్ ప్యాకులు ఏంటో ఓ లుక్కేసేయండి.
ప్యాక్-1:
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అర కప్పు కీర దోస ముక్కలు, కప్పు పుదీనా ఆకులు వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.ఆ తర్వాత ఈ పేస్ట్‌లో వన్ టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వేళ్లతో స్మూత్‌గా స్క్రబ్ చేసుకుంటూ కూల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఈ ప్యాక్ వల్ల మలినాలు, మృతకణాలు తొలగిపోవడమే కాదు చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.దాంతో ముఖంపై తరచూ మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి.మరియు వారంలో రెండు సార్లు ఈ ప్యాక్‌ను వేసుకుంటే స్క్రిన్ గ్లోగా, ఫ్రెష్‌గా కూడా మెరుస్తుంది.

ప్యాక్-2: రెండు స్ట్రాబెర్రీ పండ్లను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ పేస్ట్‌లో ఒక స్పూన్ కోకో పౌడర్, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ పచ్చి పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.
పావు గంట తర్వాత వాటర్‌తో చర్మాన్ని శుభ్ర పరుచుకోవాలి.ఈ ఫ్యాక్ వల్ల స్కిన్ టోన్ పెరుగుతుంది.డ్రై స్క్రిన్ సమస్య తగ్గుతుంది.మరియు ముఖం నిత్యవ్వనంగా మారుతుంది.
.