Android apps : ఈ సంవత్సరం వచ్చిన బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే... మీ ఫోన్లో ఉన్నాయా?

ఈ స్మార్ట్ యుగంలో ఆండ్రాయిడ్ ఫోన్స్ రాజ్యమేలుతున్నాయి.తదనుగుణంగా ఆండ్రాయిడ్ యాప్స్ కూడా గుట్టలు గుట్టలుగా పుట్టుకొస్తున్నాయి.

 These Are The Best Android Apps Of This Year. Do You Have Them On Your Phone ,-TeluguStop.com

అయితే అందులో ఏ కొన్నో జనాల మనసులను రంజింపజేస్తున్నాయి.ఇక ఈ ఏడాది ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి వున్నాయి.

అవును, మరో నెల రోజుల్లో 2023 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.ఈ క్రమంలో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఓ అంశంపైనా తన నివేదికను విడుదల చేసింది.2022లో గూగుల్ ప్లేస్టోర్‌లో నుంచి ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ డేటాను ఈరోజు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో అందరూ అనుకున్నట్టుగానే సోషల్ మీడియా యాప్ ‘బీరియల్’ 2022లో ఉత్తమ యాప్‌గా నిలిచింది.

అలాగే EA స్పోర్ట్స్‌కు చెందిన ప్రసిద్ధ గేమ్ రాయల్ – హీరో షూటర్ మొబైల్ వెర్షన్ అయిన ‘అపెక్స్ లెజెండ్స్ మొబైల్‌’ ఉత్తమ ఆండ్రాయిడ్ గేమ్‌గా రికార్డులు బద్దలు కొట్టింది.బెస్ట్ యాప్స్ విషయానికి వస్తే.

AI- ఆధారిత ఆర్ట్ జనరేషన్ టూల్ డ్రీమ్ బై WOMBO 2022 ఉత్తమ యాప్‌గా నిలిచి అందరినీ విస్మయానికి గురి చేసింది.కాగా ఈ యాప్స్ జాబితాను అమెరికాలోని గూగుల్ ప్లే ఎడిటోరియల్ టీమ్ ఎంపిక చేసింది.

Telugu Latest, Ups-Latest News - Telugu

ఇపుడు 2022లో బెస్ట్ యాప్స్ పరిశీలిద్దాము.ఓవరాల్ గా చూసుకుంటే బెస్ట్ యాప్ గా ‘డ్రీమ్ బై వోంబో‘ నిలిచింది.యూజర్స్ ఛాయిస్ కి గాను ‘BeReal‘ అనే యాప్, ఎంటర్‌ట్రైన్‌మెంట్‌ బెస్ట్ యాప్ గా ‘PetStar‘, హానరబుల్ మెన్షన్స్ విషయానికొస్తే ‘DanceFitMe, NoteIt విడ్జెట్‘ పర్సనల్ గ్రోత్‌ బెస్ట్ యాప్ ‘బ్రీత్‌వర్క్’ హానరబుల్ మెన్షన్స్ ‘డుయోలింగో ABC‘, జిమ్ లాగ్ & వర్కౌట్‌ల యాప్ ‘యూసిషియన్ బై ఉకులేలే’ బెస్ట్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ కి గాను ‘ప్లాంట్ పేరెంట్’ హానరబుల్ మెన్షన్స్… ‘బుక్ మార్నింగ్ రొటీన్ వేకింగ్ అప్, డైలీ డైరీ, స్లీప్ ట్రాకర్’ తదితర యాప్స్ టాప్ లో నిలిచాయి.వివరములు కొరకు తదితర ఆఫీసియల్ సైట్ చూడగలరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube