మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..!

బ్యాంక్ పనిమీద పదే పదే ఇంటి నుంచి బయటకు వెళ్లడం ద్వారా కరోనా బారిన పడే అవకాశాలు ఉంటాయి.కనుక భారతదేశ బ్యాంకులకు బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల సెలవు దినాలను ఖరారు చేసింది.

 These Are The Bank Holidays In The Month Of May  May Month, Bank Holidays, 12 Da-TeluguStop.com

వాటి ఆధారంగా మీ పనులు ప్లాన్ చేసుకోండి.కరోనా సెకండ్ వేవ్ సమయంలో బ్యాంకు పనిమీద వెళ్లేవారు బ్యాంక్ సెలవులు, పనిదినాలు తెలుసుకోవాలి.

బ్యాంక్ సెలవుల కు సంబంధించి పూర్తి వివరాలకు మీరు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు .రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన  ప్రకారం మే నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవు దినాలు.అంటే బ్యాకు ఉద్యోగులు ఆ రోజులలో విధులకు హాజరు అవాల్సిన అవసరం ఉండదు.అయితే రాష్ట్రాలను బట్టి సెలవులు ఆధారపడి ఉంటాయి.ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు బ్యాంకులు సేవలు అందించవని తెలిసిందే.

మే నెల‌లో బ్యాంకుల‌కు భారీగా సెల‌వులు రానున్నాయి.

అందుకే మీకు సంబంధించి బ్యాంకుల్లో ముఖ్య‌మైన లావాదేవీలు ఏమైనా ఉంటే మాత్రం ఇప్పుడే పూర్తి చేసుకుంటే మంచిది.ఎందుకంటే మే నెలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులకు సెల‌వులు వచ్చాయి.

ఈ సెలవుల్లో 5 ఆదివారాలు (2, 9, 16, 23, 30 తేదీలు), 8,22 వ తేదీ రెండు, నాలుగో శ‌నివారం మొత్తం ఈ 7 రోజులు సాధారణ సెలవులు కాగా.మ‌రోవైపు మే 1న మేడే, 7వ తేదీన జ‌మాతుల్ విద, 13 న ఈదుల్ ఫిత‌ర్‌, 14న రంజాన్‌, 26 బుద్ధ‌పూర్ణిమ‌ ఉన్నాయి.

అంటే మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి.మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకులు 4 గంటలు మాత్రమే ప‌నిచేస్తున్నాయి.50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే బ్యాంకుల్లో విధులు నిర్వ‌హిస్తున్న సంగతి తెలిసింది.కాగా వీలైనంత వ‌ర‌కు డిజిట‌ల్ పేమెంట్స్ చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube