ఈ నెలలో లాంచ్ అయ్యే అదిరిపోయే బైక్స్, స్కూటర్లు ఇవే..

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ చాలా పెద్దది.మోటార్‌సైకిల్, స్కూటర్లకు ఇండియాలో ఎప్పుడూ చాలా అధికంగా డిమాండ్ నెలకొంటుంది.

 These Are The Amazing Bikes And Scooters That Will Be Launched This Month, Upcom-TeluguStop.com

అందువల్ల కంపెనీలు మన ఇండియాలో ప్రతినెలా కొత్త స్కూటర్లు, బైక్స్ లాంచ్ చేస్తుంటాయి.మరి ఈ అక్టోబర్ నెలలో లాంచ్ కానున్న టాప్ టూవీలర్స్ ఏవో చూద్దాం.

• హిమాలయన్ 450:

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ( Royal Enfield Himalayan 450 )అక్టోబర్ నెలలో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అవుతుంది.ఈ కొత్త మోటార్‌సైకిల్ రూ.2.80 లక్షల ప్రైస్ ట్యాగ్‌తో రావచ్చని సమాచారం.ఇది కేటీఎం 390 అడ్వెంచర్, అప్‌కమింగ్ బైక్ హీరో ఎక్స్‌పల్స్ 400తో పోటీపడుతుంది.

Telugu Aprilia Rs, India, Kinetic Luna, Ather, October, Royalenfield, Scooters-L

• ఏప్రిలియా RS 457:

సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ ఏప్రిలియా RS 457 ఈ నెలలో భారతదేశంలో లాంచ్ అవ్వచ్చు.దీని ధర దాదాపు రూ.4.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.ఇది పంచ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్, ప్రీమియం హార్డ్‌వేర్, అద్భుతమైన లుక్‌లతో చాలామందిని ఆకట్టుకోగల మోటార్‌సైకిల్.ఇది కవాసకి నింజా 400తో పోటీపడుతుంది, దీని ధర రూ.5.19 లక్షలు.

Telugu Aprilia Rs, India, Kinetic Luna, Ather, October, Royalenfield, Scooters-L

• షాట్‌గన్ 650:

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650( Royal Enfield Shotgun 650 ) మోటార్‌సైకిల్ ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది.ఇది బాబర్ స్టైల్ మోటార్‌సైకిల్.స్ట్రిప్డ్-డౌన్ లుక్, లో-స్లంగ్ రైడింగ్ పొజిషన్‌తో ఈ మోటార్‌సైకిల్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650 వంటి ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో సేమ్ 650cc ఇంజన్‌తో షాట్‌గన్ 650 అందుబాటులోకి రానుంది.షాట్‌గన్ 650 ధర సుమారు రూ.3.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయిస్తుందని అంచనా.ఇది హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 750, ట్రయంఫ్ బోన్నెవిల్లే బాబర్ వంటి కొన్ని బైక్స్‌ కంటే తక్కువ ధరతో వస్తుంది.

Telugu Aprilia Rs, India, Kinetic Luna, Ather, October, Royalenfield, Scooters-L

• ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X:

కొత్త ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X( Triumph Scrambler 400X ) మోటార్‌సైకిల్ ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ రైడింగ్ కేపబిలిటీస్‌తో వస్తుంది.స్క్రాంబ్లర్ 400X ధర సుమారు రూ.2.70 లక్షలు (ఎక్స్-షోరూమ్).అంటే ఇది ట్రయంఫ్ స్పీడ్ 400 కంటే చాలా ఖరీదైనది.

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, బెనెల్లీ లియోన్సినో 500 వంటి ఇతర స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది.

Telugu Aprilia Rs, India, Kinetic Luna, Ather, October, Royalenfield, Scooters-L

• కైనెటిక్ ఇ-లూనా:

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కైనెటిక్ ఇ-లూనా( Kinetic E-Luna ) ఈ నెలలో ఇండియాలో రిలీజ్ అవ్వచ్చు.ఇది గరిష్టంగా 50kmph వేగంతో దూసుకెళ్తుంది.ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 100km రేంజ్ ఆఫర్ చేస్తుంది.దీని ధర రూ.80,000 నుంచి రూ.90,000 మధ్య ఉండవచ్చని అంచనా.

Telugu Aprilia Rs, India, Kinetic Luna, Ather, October, Royalenfield, Scooters-L

• ఏథర్ 450S కొత్త వేరియంట్

ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొత్త వెర్షన్ 156కిమీల సర్టిఫైడ్ రేంజ్‌తో త్వరలో విడుదల కానుంది.ఇది ప్రస్తుత 115కిమీ రేంజ్ కంటే భారీ పెరుగుదల.కొత్త వేరియంట్ ధర ప్రస్తుత 450S కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా, దీని ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, FAME 2 సబ్సిడీలతో సహా).ఇది Ola S1 ఎయిర్, TVS iQube ఎలక్ట్రిక్, బజాజ్ చేతక్ వంటి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube