ఇకపై కారులో ఇవి తప్పనిసరి..!

ఇటీవల వాహానదారుల కోసం కేంద్రం కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే టోల్స్ గేట్స్ వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది.

 These Are No Longer Mandatory In The Car Air Bags, 2 Air Bags, Central Governmen-TeluguStop.com

అదే విధంగా వాహనదారుల కోసం మరిన్ని చట్టాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

కారు వాడుతున్నవారు తమ వాహనాలలో సీట్లకు ఎయిర్ బ్యాగ్స్ ను తప్పనిసరి చేసింది.

ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను న్యాయ మంత్రిత్వ శాఖకు అంగీకరించింది.ఇక నుంచి కారు డ్రైవర్ తోపాటు పక్కసీటులో ఉండే ప్రయాణికుడి వైపు కూడా ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేసింది.

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి రానుంది.దీనిపై అధికారికంగా నోటిఫికేషన్ ‌మరో మూడు రోజుల్లో వెలువడనున్నట్లు సమాచారం.కార్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇందులో భాగంగానే ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా కార్లలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేయనుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం 4 చక్రాల వాహనాలకు డ్రైవర్‌ వైపు ఎయిర్‌ బ్యాగ్‌ తప్పనిసరి.దీంతో ప్రమాద సమయంలో డ్రైవర్‌ తప్పించుకొన్న.

సహ ప్రయాణికుడి ప్రాణాలు ప్రమాదంలో పడతాడు.

Telugu Air Bags, April, Car Bags, Central, Passenger-Latest News - Telugu

ఈ నేపథ్యంలోనే కేంద్రం రెండు ఎయిర్ బ్యాగ్స్ నిబంధనను తీసుకురానుంది.ఇటీవలే ఫాస్టాగ్ లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం యోచిస్తుంది.ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ లలో ఫాస్టాగ్ పార్కింగ్ పేమెంట్ సేవలు అందుబాటులో ఉంచిన కేంద్రం వాటిని మరింత విసృతం చేయాలని చూస్తోంది.

అలాగే పెట్రోల్, డీజిల్, పీఎన్జీ వంటిని కొనుగోలు చేయడానికి కూడా ఫాస్టాగ్ తప్పనిసరి చేయనుంది.ఇక గత నెల ఫిబ్రవరి 15 నుంచి ఫాస్టాగ్స్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

ఫాస్టాగ్ సేవల వలన టోల్ గేట్స్ వద్ద రద్దీ తగ్గిపోవడమే కాకుండా పేమెంట్ ప్రక్రియ సులువుగా అయిపోతుంది.ఇక చాలా మంది ఇప్పటికే ఈ ఫాస్టాగ్ తీసుకున్నవారున్నారు.

ఒక తమ వెహికల్స్ కు ఫాస్టాగ్ లేకపోతే రెట్టింపు జరిమానా కట్టాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube